Home /News /movies /

FELICITATION FOR ALLU ARJUN PARTY HOSTED BY ICON STAR ALLU ARJUN FATHER IN LAW TO CELEBRATE PUSHPA SUCCESS SR

Allu Arjun | అల్లు అర్జున్‌కు ఘన సన్మానం... హాజరైన చిరంజీవి, త్రివిక్రమ్.. పిక్స్ వైరల్..

Allu Arjun Photo : Twitter

Allu Arjun Photo : Twitter

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) ఇటీవల 'పుష్ప' (Pushpa) సినిమాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. హిందీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కేక పెట్టించింది.

ఇంకా చదవండి ...
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) ఇటీవల 'పుష్ప' (Pushpa) సినిమాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. హిందీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కేక పెట్టించింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ అంటే స్నేహా రెడ్డి తండ్రి గ్రాండ్‌గా ఓ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులోని పార్క్ హయత్‌లో ఇచ్చిన గ్రాండ్ పార్టీకి చిరంజీవి సురేఖ దంపతులతో పాటు అరవింద్ దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు హారీష్ శంకర్ హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా తన అల్లుడు బన్నీని చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుష్ప ఇచ్చిన ఊపుతో అల్లు అర్జున్ ఓ హిందీ చిత్రాన్ని చేయబోతున్నారని తెలుస్తోంది. హిందీ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాను అల్లు అర్జున్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.

  ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. అంతేకాదు ఈ చిత్రం హిందీ వెర్షన్ నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని.. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.


  పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.

  ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో మైమరిపించారు. పుష్పలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Pushpa, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు