• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • FAST AND FURIOUS F 9 WILL END WITH 11TH SERIES SAYS VIN DIESEL HERE ARE THE DETAILS TA

Fast & Furious F 9: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌కు ముగింపు పలకబోతున్న చిత్ర యూనిట్..

ఫాస్ట్ అండ్ ఫ్యూరియ్ 9 సిరీస్‌(Twitter/Photo)

Fast & Furious F 9: ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి.  ఆ తర్వాత జేమ్స్ బాండ్ మూవీస్ తరహా యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా పాపులర్ అయిన సిరీస్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒకటి. తాజాగా ఈ సిరీస్‌కు ముగింపు పలకబోతున్నట్టు హీరో విన్ డీజిల్ ప్రకటించారు.

  • Share this:
    Fast & Furious F 9: ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి.  ఆ తర్వాత జేమ్స్ బాండ్ మూవీస్ తరహా యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా పాపులర్ అయిన సిరీస్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 8 చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలో విన్ డీజిల్ హీరోగా పాపులర్ అయ్యారు. దీంతో పాటు ఇందులో యాక్ట్ చేసిన నటీనటలందరూ కూడా ఫేమస్ అయ్యారు. త్వరలో ‘ఫ్యాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో 9వ చిత్రం రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫ్యాస్ అండ్ ఫ్యూరియస్ 8 సిరీస్ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో 10 మరియు 11 చిత్రాలు తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. ఎఫ్ 9 సిరీస్‌ను జస్టిన్ లిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సిరిస్‌లో 10 మరియు 11 చిత్రాల తర్వాత ఈ ఫ్రాంఛైజీకి ముగింపు పలకబోతున్నట్టు హీరో విన్ డీజిల్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

    Fast & Furious F 9 Will End with 11Th Series Says Vin Diesel Here Are The Details,Fast & Furious F 9 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌కు ముగింపు పలకబోతున్న చిత్ర యూనిట్..,fast-and-furious 9,FF9,fast-and-furious Series,Vin Diesel,Fast Furious Last Franchise 11,Hollywood,Tollywood,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీ ఎండ్,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11తో ఎండ్ కార్డ్,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌కు ముగింపు
    ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మూవీ (Twitter/Photo)


    ఇక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మింగుడు పడని విషయమే అన్నారు. మరోవైపు విన్ డీజిల్ మాట్లాడుతూ.. ఏదైనా కథకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సిందే. ఇపుడు మేము ఈ సిరీస్‌కు అదే తరహా ముగింపు పలకబోతున్నట్టు చెప్పారు. మొత్తంగా 2003లో విడుదలైన ఈ సిరీస్‌లో చివరిది 11వ ఫ్రాంఛైజీ 2023లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్. మొత్తంగా 20 యేళ్ల ఈ సిరీస్‌కు చిత్ర దర్శక, నిర్మాతలు మంగళం పాడనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: