news18-telugu
Updated: December 3, 2019, 8:27 AM IST
దబంగ్ 3 లో సల్మాన్ ఖాన్ (Twitter/Photo)
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బిగ్‌బాస్ షో నిర్వాహకులు బిగ్ షాక్ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్..ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్‌బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో చేసేందకు బిగ్‌బాస్ నిర్వాహకులు.. సల్లూభాయ్‌కు భారీ ఎత్తున పారితోషకం ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. మరోవైపు సల్మాన్..ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేసాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకుగా విడుదల కానుంది. మరోవైపు ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ అనే కొత్త సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఈద్ పండగ నాడు రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో షూటింగ్ చేస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్.. తన దగ్గర ఉన్న డేట్స్ ఈ సినిమాకే కేటాయించాడు. అందుకే ఇపుడు బిగ్‌బాస్ 13 ను సల్మాన్ ప్లేస్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఫరాఖాన్.. బిగ్‌బాస్ 8 కు హోస్ట్ వ్యవహరించిన అనుభవం ఉంది.

బిగ్‌బాస్ 13 హోస్ట్‌గా సల్మాన్ ప్లేస్‌లో ఫరా ఖాన్ (twitter/Photo)
ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే.. కరణ్ జోహార్ లేకపోతే అనిల్ కపూర్‌తో చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి హిందీలో సల్మాన్ ఖాన్ తనదైన నవ్వులతో ఈ షోను ఎక్కడికో తీసుకెళ్లాడు. మరి సల్మాన్‌లా బిగ్‌బాస్ 13 మిగిలిన సీజన్ బాధ్యతను ఈ ముగ్గురిలో ఎవరు తీసుకుంటారో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 3, 2019, 8:23 AM IST