సంక్రాంతికి తమిళనాట రజినీకాంత్ ‘పేట్టా’ రిలీజ్..మరి తెలుగులో ?

గత కొన్నేళ్లుగా రజినీకాంత్ నటించిన ఏ సినిమాలు కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఇక సూపర్ స్టార్ సినిమా ఎపుడు ప్రారంభోత్సవం చేసుకున్నా...సినిమా విడుదల తేది విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ నెలకొని ఉండేది. ఆల్రెడీ తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా రిలీజ్ కాలేదు.

news18-telugu
Updated: December 4, 2018, 2:28 PM IST
సంక్రాంతికి తమిళనాట రజినీకాంత్ ‘పేట్టా’ రిలీజ్..మరి తెలుగులో ?
‘పేట్టా’లో రజినీకాంత్
  • Share this:
గత కొన్నేళ్లుగా రజినీకాంత్ నటించిన ఏ సినిమాలు కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఇక సూపర్ స్టార్ సినిమా ఎపుడు ప్రారంభోత్సవం చేసుకున్నా...సినిమా విడుదల తేది విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ నెలకొని ఉండేది. ఇక రోబో సీక్వెల్ ‘2.O’ పోయిన దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ...ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత నవంబర్ 29న విడుదలైనుండే.

అంతకు ముందు ‘కాలా’ మూవీ కూడా చాలా రిలీజ్ డేట్స్ మార్చుకున్న తర్వాత కానీ విడుదల కాలేదు. తాజాగా రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేట్టా’ మూవీ చేసాడు. జూన్‌లో ప్రారంభమైన ఈ మూవీని అక్టోబర్‌ నెలాఖరు వరకే కంప్లీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు తలైవా.

‘పేట్టా’లో రజినీకాంత్


తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ సహా ఒక పాటను కూడా రిలీజ్ చేసారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు ఈ మూవీ మేకర్స్. ఆల్రెడీ తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా రిలీజ్ కాలేదు.

‘పేట్టా’లో రజినీకాంత్


ఇక రజినీకాంత్ నటించిన ‘భాషా’ మూవీ నుంచి ఆయన నటించిన ఏ సినిమా అయినా అటు తమిళంలో తెలుగులో ఒక్కసారే రిలీజ్ అవుతూ వచ్చాయి. కానీ ‘పేట్టా’ విషయంలో మాత్రం ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

‘పేట్టా’లో రజినీకాంత్ న్యూ లుక్
సన్ నెట్‌వర్క్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసాడు. ఆల్రెడీ తమిళంలో విడుదల కానున్న ఈ మూవీని తెలుగు వెర్షన్ సంక్రాంతి విడుదల కావడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ తెలుగులో సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు బెర్త్‌లను కన్ఫామ్ చేసుకున్నాయి. మరోవైపు ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైట్ పొజిషన్‌లో రజినీకాంత్ సినిమాకు థియేటర్స్ దొరకడం చాలా కష్టం.

రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’


ఇప్పటికే తమిళంలో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. తెలుగులో అసలు ఈ మూవీ ఊసేలేదు. మొత్తానికి తమిళంలో రిలీజైన తర్వాత లేటుగా తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ తమిళ్‌లో విడుదలైన తర్వాత తెలుగులో ‘పేట్టా’ రిలీజైతే..‘భాషా’ తర్వాత రజినీకాంత్ నటించిన ఒక మూవీ తమిళ్ తర్వాత తెలుగులో రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి.

‘పేట్టా’లో రజినీకాంత్


మరి చూడాలికా..మొత్తానికి రజినీ మూవీ...తెలుగులో కాకుండా తమిళంలో విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.


ఇది కూడా చదవండి 

రజినీకాంత్ ‘పేట్టా’ మూవీ నుంచి ‘మారన మాస్’ సాంగ్ రిలీజ్

4 రోజుల్లో రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ‘2.O’ : దటీజ్ రజినీకాంత్

4 రోజులు.. 400 కోట్లు.. ‘2.0’ వ‌సూళ్ల‌లో నిజ‌మెంత‌..?
Published by: Kiran Kumar Thanjavur
First published: December 4, 2018, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading