శ్రీముఖి చేస్తోన్న పనికి ఫీల్ అవుతున్న అభిమానులు..

తెలుగు రాష్ట్రాల్లో పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి. ఈ  ప్రోగ్రామ్‌తో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ప్రవర్తనపై ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: November 29, 2019, 2:40 PM IST
శ్రీముఖి చేస్తోన్న పనికి ఫీల్ అవుతున్న అభిమానులు..
తన ఫీలింగ్స్ అన్నీ తన వరకే ఉంటాయని.. ఒకరిపై ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోనని చెప్పుకొచ్చింది శ్రీముఖి. గతం నేర్పిన అనుభవాల నుంచి ఈ భావనలు వచ్చాయేమో అంటుంది ఈ ముద్దుగుమ్మ.
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి. ఈ  ప్రోగ్రామ్‌తో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా ఈ భామ.. తెలుగులో బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో పాల్గొనడమే కాదు మూడవ సీజన్ రన్నరప్‌గా కూడా నిలిచింది. బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం చిన్నితెర రాములమ్మేనంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక బిగ్‌బాస్‌ పూర్తవగానే శ్రీముఖి మీడియాకు చిక్కకుండా విహారయాత్రకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసింది.. ఆ వెకేషన్‌ను ఇటీవలే పూర్తి చేసుకుని షూటింగ్‌లో మళ్లీ బిజీ అయ్యింది శ్రీముఖి.అయితే ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ స్లో గా సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. కారణం .. అందరి కంటే ఎక్కువగా ఈ మూడో సీజన్ కంటెస్టెంట్లు తమకు వచ్చిన ఫేమ్‌ను వాడుకుంటోన్నారు. ఈ క్రమంలో హిమజ అందరికంటే ముందుగా ఉంటుంది. ఎలిమినేట్ అయి బయటక వచ్చినప్పటి నుంచి తనకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్తోంది. ఈమెతో పాటు అషూ పునర్నవి, శివజ్యోతి, వరుణ్ సందేశ్ లాంటి వారు కూడా అంతో ఇంతో వెనకేసుకుంటున్నారు.ఇక రాహుల్ స్పీడ్ పెంచేసాడు. తన ప్రొఫెషన్ అయిన సింగింగ్‌లో పలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.

bigg boss 3 fame srimukhi turned as singer in star maa,srimukhi,srimukhi new programme,srimukhi,srimukhi instagram,srimukhi facebook,srimukhi twitter,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu title winner,bigg boss,sreemukhi interview after bigg boss,sreemukhi after bigg boss,srimukhi,sreemukhi bigg boss 3,bigg boss 3 winner,bigg boss telugu season 3,sreemukhi,srimukhi bigg boss 3,bigg boss 3 telugu house,bigg boss 3 telugu promo,bigg boss 3 contestants,bigg boss 3 telugu latest,nagarjuna,rahul srimukhi,శ్రీముఖి,శ్రీముఖి ప్రోగ్రామ్స్,పటాస్,పటాస్ శ్రీముఖి,బిగ్‌బాస్ శ్రీముఖి,శ్రీముఖి రాహుల్,రాహుల్ శ్రీముఖి,శ్రీముఖి కొత్త ప్రోగ్రామ్,శ్రీముఖి కొత్త ప్రోగ్రామ్
శ్రీముఖి (Image : star maa)


బయటకు వచ్చిన క్షణం నుంచే రికార్డింగ్‌లంటూ బిజీగా గడిపేస్తున్నాడు. తన సత్తా చాటేందుకు గ్రాండ్‌గా ఫ్యాన్ మీట్‌ను కూడా నిర్వహించబోతోన్నాడు.ఏదేమైనా వీరితో పోల్చుకొంటే పటాస్ రాములమ్మ ఇంకా తన ఇమేజ్ ను వాడుకోవడంలేదనే అనుకుంటున్నారు అభిమానులు. తాజాగా స్టార్ మా లో ఒక సింగింగ్ ప్రోగ్రామ్‌కు ఓకే చెప్పింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమైనా వేరే వాళ్లతో పోల్చుకుంటే.. అవకాశాలను అందిపుచ్చుకోవడంతో మిగతా వాళ్లకంటే కాస్తా వెనబడిందనే చెప్పాలి. 
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading