సమంతా.. మరీ ఇలా అయితే ఎలా..? వర్రీ అవుతున్న ఫ్యాన్స్

Samantha : సన్నగా ఉండటం మంచిదే కానీ మరీ శరీరంపై బొక్కలు తేలేంత స్లిమ్‌నెస్ అవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. ఇక మరో నెటిజెన్ అయితే.. సమంత ఓవర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేయడంవల్ల పేషెంట్‌లా తయారైందని కామెంట్ చేశాడు.

news18-telugu
Updated: August 30, 2019, 12:36 PM IST
సమంతా.. మరీ ఇలా అయితే ఎలా..? వర్రీ అవుతున్న ఫ్యాన్స్
సమంత అక్కినేని (ఫైల్ ఫోటో)
  • Share this:
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరీ చిక్కిపోతోందా..? రోజురోజుకు మరీ పీలగా తయారవుతోందా..? ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోపై ఫ్యాన్స్ ఇలాగే వర్రీ అవుతున్నారు. వర్రీ అవడమే కాదు.. సమంత.. మరీ ఇలా చిక్కిపోతే ఎలా అని విచారం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత సన్నబడితే.. క్యూట్‌నెస్ అంతా పోతుందని సలహా ఇస్తున్నారు.సన్నగా ఉండటం మంచిదే కానీ మరీ శరీరంపై బొక్కలు తేలేంత స్లిమ్‌నెస్ అవసరం లేదంటున్నారు. ఇక మరో నెటిజెన్ అయితే.. సమంత ఓవర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేయడంవల్ల పేషెంట్‌లా తయారైందని కామెంట్ చేశాడు. సమంత ఇకనైనా కాస్త మంచిగా తిని తిరిగి మంచి పర్సనాలిటీతో కనిపించాలని వారు కోరుకుంటున్నారు. సమంత పోస్ట్ చేసిన ఆ ఫోటోపై ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు ఇలా తమకు తోచినట్టు స్పందించారు. మరి అభిమానుల సలహాను సమంత చెవిన పెడుతుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది సమంత. ఓ బేబీ సినిమా తర్వాత ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో త్రిష-విజయ్ సేతుపతి జంటగా హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

View this post on Instagram

Miss me ? 🤓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...