జఘన సుందరి.. నడుము మంజరి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్లతో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అసలు తెలుగులో ఇలియానా అంత త్వరగా స్టార్ హీరోయిన్ అయిందంటే కారణమే ఫిజిక్. ముఖ్యంగా నడుము సోయగాలతో అప్పట్లో తీపి నరకం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు ఇలియానాను చూసి అయ్యోపాపం అంటున్నారు అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు.
ఒకప్పటి ఇలియానాతో పోలిస్తే ఇప్పుడు చాలా తేడాగా ఉంది ఈ భామ. పిజిక్‌పై పట్టు కోల్పోయి బరువు పెరిగిపోయి.. గ్లామర్ లేకుండా మారిపోయింది. ఇప్పుడు "అమర్ అక్బర్ ఆంటోనీ"లో కూడా ఇలియానా చాలా లావుగా బరువు పెరిగిపోయి కనిపిస్తుంది. ఒకప్పటి ఇల్లీబేబీని బూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ఇందులో ఆమె లుక్స్‌పై కూడా చాలా సెటైర్లు పేలుతున్నాయి.
ఆరేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నా కూడా ఇప్పటికీ అదే క్రేజ్ అయితే ఉంది కానీ అందం మాత్రం లేదు. అసలు ఆరేళ్ల తర్వాత వస్తున్న ఇలియానాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం అవసరమా అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ రవితేజతో ఇలియానా ఇప్పటికే మూడు సినిమాలు చేసింది.. పైగా కాంబినేషన్ క్రేజీ కాబట్టి ఇంత మొత్తం ఇచ్చేసారు. ప్రమోషన్స్ కు కూడా రావట్లేదు ఈ భామ.
మొత్తానికి ఆరేళ్లు కాదు.. పదేళ్ల తర్వాత వచ్చినా తాను కోటితారనే అని మరోసారి నిరూపించుకుంది ఇలియానా. ఒకవేళ "అమర్ అక్బర్ ఆంటోనీ" కానీ హిట్ అయిందంటే మళ్లీ తెలుగులో సెటిల్ అయిపోతుందేమో..? అయినా ఏమైనా.. ఇప్పుడు ఇలియానా మాత్రం ఫిజిక్‌పై దృష్టి పెట్టకపోతే "అమర్ అక్బర్ ఆంటోనీ" తర్వాత మళ్లీ దర్శక నిర్మాతలు చూడమన్నా ఆమె వైపు చూడరేమో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema