బాలయ్య సినిమాకు జూ.ఎన్టీఆర్ టైటిల్ ? వద్దంటున్న ఫ్యాన్స్

నందమూరి నాయకుడు బాలకృష్ణ మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాకు ఓ టైటిల్‌ను సెట్ చేశారు. అయితే ఆ టైటిల్ వద్దని ఇప్పుడు బాలయ్య అభిమానులు రచ్చ చేస్తున్నారు.

news18-telugu
Updated: May 13, 2019, 10:17 AM IST
బాలయ్య సినిమాకు జూ.ఎన్టీఆర్ టైటిల్ ? వద్దంటున్న ఫ్యాన్స్
బాలకృష్ణ (File)
  • Share this:
బాలయ్య అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆయన సినిమాల్లో ఎంత రచ్చ చేస్తాడో...ఆయన ఫ్యాన్స్‌కూ బయట అంతే సందడి చేస్తారు. తాజాగా నందమూరి నాయకుడు బాలకృష్ణ మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాకు ఓ టైటిల్‌ను సెట్ చేశారు. అయితే ఆ టైటిల్ వద్దని ఇప్పుడు బాలయ్య అభిమానులు రచ్చ చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత బాలకృష్ణ కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. అయతే ఈ మూవీకి ‘రూలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.అయితే ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని అనుకుంటున్నారు మూవీ టీం. ఈ వారమే సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో బాలయ్య అభిమానులకు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఈమూవీకి 'రూలర్' అన్న టైటిల్ ఫిక్స్ చేయడం తమ ఇగో ను దెబ్బతీస్తోందని చెబుతున్నారు.

ఎందుకంటే బోయపటి తీసిన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో రూలర్ అన్న పాట ఉంది. ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే అదే టైటిల్‌తో అప్పట్లో జూనియర్ కూడా సినిమా తీయాలనుకున్నాడట. అది కుదరలేదు. దీంతో ఇప్పుడు అదే ‘రూలర్’ బాలయ్య సినిమాకు టైటిల్ పెట్టడం అభిమానులకు అంత నచ్చడం లేదంట. ఎవర్నీ ఫాలో కాని బాలకృష్ణ జూనియర్‌ను ఫాలో అవుతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారట. మరి అభిమానుల అభ్యంతరాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


First published: May 13, 2019, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading