news18-telugu
Updated: January 4, 2020, 12:23 PM IST
బోల్డ్ సీన్స్‌లో రాశీఖన్నా
రాశీఖన్నా... ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బొద్దుగుమ్మగా ముద్దు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కాలంలో అనేక సినిమాల్లో మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేసమ్ లవర్‌లో కూడా రాశీఖన్నా నటంచింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే... టీజర్ సునామీ సృష్టించింది. టీజర్ చూసి దేవర కొండ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోసారి అర్జున్ రెడ్డి వచ్చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే అటు రాశీఖన్నా ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు. టీజర్ చూస్తే.. రాశీఖన్నాకు సంబంధించి పలు బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు అంతా రాశీ ఖన్నాపై మండిపడుతున్నారు. నీకు ఎందుకింత ఖర్మ అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయ్ సినిమాలో రాశీ పోషించిన పాత్ర చేయడం తన అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. దాంతో సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నిస్తూ మెసేజెస్ పెడుతున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 4, 2020, 12:23 PM IST