హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth: రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన.. కోలుకోవాలంటూ ప్రార్థనలు

Rajinikanth: రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన.. కోలుకోవాలంటూ ప్రార్థనలు

మరోవైపు రజినీకాంత్ కూడా తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఉన్నట్లుండి ఇప్పుడు ఈయన అమెరికా వెళ్లడానికి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మా రజినీకాంత్‌కు ఏమైంది.. ఏదైనా సమస్య ఉందా అంటూ కంగారు పడుతున్నారు.

మరోవైపు రజినీకాంత్ కూడా తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఉన్నట్లుండి ఇప్పుడు ఈయన అమెరికా వెళ్లడానికి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మా రజినీకాంత్‌కు ఏమైంది.. ఏదైనా సమస్య ఉందా అంటూ కంగారు పడుతున్నారు.

Rajinikanth Health: సూపర్ స్టార్ రజినీకాంత్ హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. అపోలో యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలులేవని.. హైబీపీతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి ...

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మాత్రమే.. భారత సినీ పరిశ్రమ షేక్ చేస్తోంది. హైబీపీతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, తారలు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏమీ కాకూడదని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. సాధారణ అభిమానులతో పాటు సిీన తారలు, క్రీడా ప్రముఖులు కోసం రజినీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. అపోలో యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలులేవని.. హైబీపీతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని.. బీపీలో హెచ్చుతగ్గులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అపోలో డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది.

First published:

Tags: Kollywood, Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు