ఆ విషయంలో జాన్వీని.. శ్రీదేవితో పోలుస్తున్న అభిమానులు...

దివంగత నటి, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ అందం పరంగా తల్లికి తగిన కూతురిగా ఇటీవలే బాలీవుడ్ తెరపై కాలుమోపిన ఈ భామ అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకుంది. తాజాగా ఈ భామ తల్లి రూట్లోనే..

news18-telugu
Updated: November 7, 2019, 3:07 PM IST
ఆ విషయంలో జాన్వీని.. శ్రీదేవితో పోలుస్తున్న అభిమానులు...
జాన్వీ కపూర్ (File Photos)
  • Share this:
దివంగత నటి, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ అందం పరంగా తల్లికి తగిన కూతురిగా ఇటీవలే బాలీవుడ్ తెరపై కాలుమోపిన ఈ భామ అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకుంది. అయితే ఇక ఆమె రియల్ లైఫ్ విషయానికొస్తే ఈ మోడ్రెన్ రోజుల్లో ఎలా ఉండాలో సరిగ్గా అలాగే ఉంటూ తనలోని ప్రత్యేకత చాటుకుంటుంది జాన్వీ.  పొట్టి దుస్తులు ధరించడంలో ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ అని వర్ణించుకోవచ్చు. జిమ్ముకెళ్లినా, ఈవెంట్స్‌కి వెళ్లినా, సరదాగా షికారుకెళ్ళినా కెమెరా కళ్లన్నీ తనపై మాత్రమే పడేలా దుస్తులు ధరిస్తుంటుంది జాన్వీ కపూర్. ఇప్పటికే పలుసార్లు పొట్టి దుస్తులతో కెమెరాకు చిక్కిన ఈ చిన్నది.. తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది .. చాలా కాలానికి శ్రీదేవి వారసురాలు జాన్వీ కొంచెం నిండైన దుస్తుల్లో కనిపించింది. నిరంతరం చిట్టి పొట్టి నిక్కర్లతో కుర్రకారు కంటికి కునుకు అన్నదే పట్టనివ్వని ఈ అమ్మడు టాప్ టు బాటమ్ వైట్ ఫ్రాకులో కనిపించి మురిపించింది. పొట్టి నిక్కర్లతో పోలిస్తే ఇదే నిండుతనం అనిపిస్తోంది మరి.
అయితే ఇలా ఆమెను చూసిన అభిమానులు ప్రస్తుతం ఆమెను సిరిమల్లె పువ్వుతో పోలుస్తున్నారు.

janhvi kapoor,janhvi kapoor age,janhvi kapoor size,janhvi kapoor instagram,janhvi kapoor twitter,janhvi kapoor facebook,sridevi,jhanvi kapoor sridevi,khushi kapoor,jhanvi kapoor movie,jhanvi kapoor crying,janhvi kapoor interview,janhvi kapoor songs,boney kapoor,sridevi janhvi kapoor,jhanvi kapoor interview about sridevi,sridevi daughter,sridevi daughter janhvi kapoor,janhvi kapoor movie,janhvi kapoor crying,janhvi kapoor first interview,janhvi kapoor mother,janhvi kapoor dhadak,jhanvi kapoor video,జాన్వీ కపూర్,శ్రీదేవి,జాన్వీ కపూర్ శ్రీదేవి,జాన్వీ కపూర్ డ్రెస్ సైజ్
జాన్వీ కపూర్ (File photos)


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పదహారాళ్ల వయసు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ అంటే ఆ సినిమాలో శ్రీదేవిని ఎంత అందంగా చూపించారో గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. సిరిమల్లె పువ్వా టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. నాటి యువహృదయాల్ని కొల్లగొట్టిన ఈ పాటకు కె.చక్రవర్తి అద్భుతమైన సంగీతం అందించారు.సిరిమల్లె పువ్వు పేరుచెప్పగానే అలనాటి నటి శ్రీదేవి ని గుర్తుచేస్తుంది ఆ పాట. ప్రస్తుతం జాన్వీ కూడా ఆ తరహాలో కనిపిస్తోందని ఆమె అభిమానులు చెప్పకనే చెబుతున్నారు.

First published: November 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...