హోమ్ /వార్తలు /సినిమా /

సూర్యకు కాలజ్ఞానం తెలుసా ఏంటి.. సినిమాల్లో చెప్పినట్లే జరుగుతుంది..?

సూర్యకు కాలజ్ఞానం తెలుసా ఏంటి.. సినిమాల్లో చెప్పినట్లే జరుగుతుంది..?

సూర్య సినిమాలు (suriya movies)

సూర్య సినిమాలు (suriya movies)

Suriya: ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానాలు వస్తున్నాయి. జరగబోయేది ముందే తెలిసినట్లు ఆయన సినిమాల్లో చూపించేసాడు సూర్య.

ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానాలు వస్తున్నాయి. జరగబోయేది ముందే తెలిసినట్లు ఆయన సినిమాల్లో చూపించేసాడు సూర్య. అసలే కరోనా వైరస్ గత కొన్ని నెలలుగా ఇండియాను వణికిస్తుంది. మన దేశంలో ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 4000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక లక్ష 50 వేల మందికి వైరస్ సోకింది. ఇప్పటికీ చాలా మందికి ఈ వైరస్ వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ వైరస్ గురించి ముందే తన సినిమాలో చూపించేసాడు సూర్య. 9 ఏళ్ల కింద వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమాలో ఈ వైరస్ గురించి ఉంటుంది.

సెవెన్త్ సెన్స్ సినిమా (7th sense)
సెవెన్త్ సెన్స్ సినిమా (7th sense)

కాకపోతే దీనికి కరోనా అనే పేరు పెట్టరు కానీ ఓ కుక్కకు చైనా వాడు ఈ వైరస్ అంటింటి జనావాసాలు ఉన్న ప్రదేశాలకు పంపించి అందరికీ వైరస్ సోకేలా చేస్తాడు విలన్. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక మిడతల దాడి ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ అవుతుంది. ఇది కూడా గతేడాది విడుదలైన బందోబస్త్ సినిమాలో చూపించాడు సూర్య. పాకిస్తాన్ నుంచి ఈ మిడతలు అన్నీ వచ్చి పంట పొలాలను నాశనం చేస్తాయి. ఇది కూడా ఓ రకంగా పాకిస్తాన్ తీసే దొంగ దెబ్బ.

సూర్య బందోబస్త్ సినిమా (suriya kaappaan movie)
సూర్య బందోబస్త్ సినిమా (suriya kaappaan movie)

దర్శకుడు కేవీ ఆనంద్ తన బందోబస్త్ సినిమాలో ఇది చూపించాడు. అచ్చంగా ఇప్పుడు మిడతలన్నీ ఇండియాలోకి వచ్చేస్తున్నాయి. పొలాలతో పాటు ఇళ్లపైకి కూడా వచ్చేస్తున్నాయి ఇవి. 8 ఏళ్ల కింద కేవీ ఆనంద్ తెరకెక్కించిన బ్రదర్స్ సినిమాలో కూడా రష్యా బ్యాన్ చేసిన డ్రగ్స్ గురించి సినిమాలో చూపించారు. అది కూడా తర్వాత బయట జరిగింది. ఇక వీడొక్కడే సినిమా గురించి అందరికీ తెలిసిందే.

సూర్య బందోబస్త్ సినిమా (suriya kaappaan movie)
సూర్య బందోబస్త్ సినిమా (suriya kaappaan movie)

ఈ చిత్రంలో కడుపులో డ్రగ్స్, డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. బయట కూడా చాలా సార్లు కూడా అలా జరిగింది. గతేడాది సూర్య తన 2డి ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలో నిర్మించిన ఉరియాది 2లో గ్యాస్ లీక్ సీన్ ఉంటుంది. అదే మొన్న వైజాగ్‌లో జరిగింది. యాదృశ్చికమో ఏమో కానీ ఈ సంఘటనలన్నింటినీ కూడా తన సినిమాలతో ముందే ప్రేక్షకులకు చూపించాడు సూర్య. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kollywood, Suriya, Tamil Cinema

ఉత్తమ కథలు