• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FANS ASKING WHAT IS HAPPENING BETWEEN CHIRANJEEVI AND TRIVIKRAM SRINIVAS PK

త్రివిక్రమ్‌ను చిరంజీవి మర్చిపోయాడా.. అసలేం జరిగింది..?

త్రివిక్రమ్‌ను చిరంజీవి మర్చిపోయాడా.. అసలేం జరిగింది..?

చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Chiranjeevi Trivikram)

Chiranjeevi Trivikram: అదేంటి.. త్రివిక్రమ్‌ను చిరంజీవి మర్చిపోవడం ఏంటి..? చాలా రోజులుగా ఈ ఇద్దరూ సినిమా చేయాలనుకుంటున్నారు కదా.. పైగా త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని చిరు కూడా కన్ఫర్మ్ చేసాడు..

  • Share this:
అదేంటి.. త్రివిక్రమ్‌ను చిరంజీవి మర్చిపోవడం ఏంటి..? చాలా రోజులుగా ఈ ఇద్దరూ సినిమా చేయాలనుకుంటున్నారు కదా.. పైగా త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని చిరు కూడా కన్ఫర్మ్ చేసాడు.. ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఏదో జరిగినట్లే కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తూనే రాబోయే ఐదు సినిమాలు కూడా డిసైడ్ అయిపోయాడు. మరో మూడు నాలుగేళ్ల వరకు కూడా చిరంజీవి డైరీ ఫుల్ అయిపోయింది. వరసగా కుర్ర దర్శకులకు అవకాశాలు ఇచ్చేస్తున్నాడు మెగాస్టార్.

చిరంజీవి సుజీత్ (chiranjeevi sujeeth)
చిరంజీవి సుజీత్ (chiranjeevi sujeeth)


అందులో నెక్ట్స్ లైన్‌లో సుజీత్, బాబీ, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్‌ను ఎంచుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత బాబీతో పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. దాంతో పాటే మెహర్ రమేష్ కూడా కథ చెప్పాడని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత మరో మూడేళ్ళ వరకు చిరంజీవి ఖాళీగా ఉండడు. అయితే అప్పట్లో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వేడుకలో మాట్లాడుతూ తాను త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేసాడు చిరంజీవి.

చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ (Chiranjeevi Trivikram Srinivas)
చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ (Chiranjeevi Trivikram Srinivas)


దానయ్య దీనికి నిర్మాత అని చెప్పాడు కూడా. కానీ మొన్న చిరు చెప్పిన దర్శకుల లిస్టులో గురూజీ పేరు లేదు. కనీసం ముగ్గురు నలుగురు దర్శకుల లిస్టులో కూడా త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. సుజీత్, బాబీ కన్ఫర్మ్ అయ్యాయి.. మెహర్ రమేష్, హరీష్ శంకర్, పరశురామ్ లాంటి వాళ్లు కథలు చెప్పారని చెప్పిన చిరు.. అందులో త్రివిక్రమ్ పేరు చెప్పలేదు.

చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Chiranjeevi Trivikram Srinivas)
చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Chiranjeevi Trivikram Srinivas)


మరిచిపోయాడా లేదంటే నిజంగానే సినిమా ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయాడా అనేది అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన గురూజీ.. నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో చిరంజీవి పేరు ఉంటుందో లేదో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు