Home /News /movies /

FANS ARE NOT HAPPY WITH VENKATESH DECISION ON NARAPPA OTT RELEASE SR

Venkatesh : వెంకటేష్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం.. అభిమాని నిరాహార దీక్ష‌

వెంకటేష్ Photo : Twitter

వెంకటేష్ Photo : Twitter

Narappa : వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

    వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కానీ కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా డిజిటల్‌లో డైరెక్ట్‌గా విడుదలవుతుందని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో జూలై 24న విడుదలకానుంది. దీనికి తోడు వెంటకేష్ నటించిన మరో సినిమా దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో వెంకటేష్ ఫ్యాన్స్ అసహనానికి గురౌతున్నారు. కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాలను థియేటర్‌లో పెద్ద తెరపై చూడాలనీ  కోరుకుంటున్నారట. ఈ విషయంలో వెంకీ ఫ్యాన్స్ అంసతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వరంగల్ కు చెందిన వెంకటేష్ అభిమాని అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్‌ సినిమా నారప్పను థియేటర్‌లోనే చూడాలని.. ఓటీటీ రిలీజ్‌కు వ్య‌తిరేఖంగా ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశాడ‌ట‌. నారప్ప సినిమాను థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. నారప్ప చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించనుంది. అసురన్‌ తమిళ్‌లో హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేస్తుంది.

    Naarappa on amazon prime, Venkatesh narappa update, Venkatesh narappa postponed, Munikanna look, naarappa news, Venkatesh naarappa begins fight scenes shoot in tamil nadu,Venkatesh Naarappa to have the another heroine along with priyamani,narappa,narappa movie,narappa teaser,srikanth addala,narappa first look, నారప్ప, వెంకటేష్, ప్రియమణి
    వరంగల్‌లో అభిమాని దీక్షPhoto : Twitter


    తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా సహజంగా ఉండేందుకు ఈ సినిమా షూటింగ్‌‌ను చాలా వరకు అనంత‌పురంజిల్లాలో జరిపారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఎఫ్ 3 అనే సినిమాలోను నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఎఫ్ 2కు సీక్వెల్’గా వస్తుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Naarappa, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు