• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FANCY DIGITAL DEAL CLOSED FOR RANA DAGGUBATI AND SAI PALLAVI MOVIE VIRATAPARVAM MHN

Rana Daggubati - Viartaparam: ‘విరాటపర్వం’కు డీల్.. రానా కెరీర్ బెస్ట్ డీల్..!

Rana Daggubati - Viartaparam: ‘విరాటపర్వం’కు డీల్.. రానా కెరీర్ బెస్ట్ డీల్..!

Fancy digital deal closed for Rana Daggubati and Sai pallavi movie Virataparvam

Rana Daggubati - Viartaparam: రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విరాటపర్వం’కు క్రేజీ డిజిటల్ డీల్ కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ప్యాన్ ఇండియా యాక్టర్ ఇమేజ్ ఉన్న అతి కొద్ది మందిలో టాలీవుడ్‌కి చెందిన రానా ద‌గ్గుబాటి ఒక‌డు. ఇప్పుడు రానా రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అందులో మొద‌టిది అర‌ణ్య‌. ఈ సినిమా మార్చి 26న విడుద‌ల కానుంది. ఇక మ‌రో చిత్రం విరాట‌ప‌ర్వం. అర‌ణ్య ఎప్పుడో సిద్ధ‌మైంది. విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మవుతున్న సినిమాల్లో విరాట‌ప‌ర్వం ముందు వ‌రుస‌లో ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు మంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. డిఫ‌రెంట్ క‌థ‌, రానా, సాయిప‌ల్ల‌వి వంటి యాక్ట‌ర్స్‌, రీసెంట్‌గా విడుద‌లైన రానా వీడియో ప్రోమో, కోలు కోలు.. సాంగ్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

    దీంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది. ఈ క్రేజ్‌ను అనుస‌రించి ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కు అమ్ముడుపోయాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ విరాట‌ప‌ర్వం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ డిజిట‌ల్ హ‌క్కుల‌ను రు.11 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. రానా కెరీర్‌లోనే ఆయ‌న సినిమాకు డిజిటల్ హ‌క్కుల‌కు ఇంత మొత్తం రావ‌డం ఇదే మొద‌ట‌సారి అని టాక్ వినిపిస్తోంది.

    నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌కే ఈ రేంజ్ కాంపీటీష‌న్ ఉంటే, థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రానా ఈ సినిమాలో ర‌వ‌న్న అనే న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విరాట‌ప‌ర్వం విడుద‌ల‌వుతుంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు