తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య చిచ్చు పెట్టిన నారప్ప..

తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య వెంకటేష్ నారప్ప  చిచ్చు పెట్టాడు.  వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 23, 2020, 8:32 AM IST
తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య చిచ్చు పెట్టిన నారప్ప..
‘నారప్ప’పాత్రలో వెంకటేష్ (Twitter/Photos)
  • Share this:
తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య వెంకటేష్ నారప్ప  చిచ్చు పెట్టాడు.  వివరాల్లోకి వెళితే.. అవును వెంకటేష్ తన కెరీర్‌లో వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. అందులో చాలా సినిమాలు వెంకటేష్‌కు మంచి సక్సెస్ అందించాయి. ఇందులో మరికొన్ని రీమేక్  చిత్రాలు.. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిపెట్టాయి కూడా. తాజాగా వెంకటేష్.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో‘నారప్ప’ టైటిల్‌తో  రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదల చేసారు. అచ్చం తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన అసురన్‌ను అచ్చుగుద్దినట్టు ఉంది. దీంతో ఈ లుక్‌పై సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకులు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా తలపాగా ఉన్నది ఉన్నట్టు దింపేసారని తమిళ ప్రేక్షకులు వెంకీ లుక్‌తో పోల్చుతూ మొదలైన ఈ సోషల్ మీడియా వార్.. ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

asuran telugu movie,narappa,venkatesh narappa,narappa first look,venkatesh74,tollywood,venkatesh,అసురన్ రీమేక్, వెంకటేష్, నారప్ప
ధనుష్, వెంకటేష్


ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు మా యాక్టర్స్‌ను మ్యాచ్ చేసేవారు ఎవరు లేరని #UnrivalledTamilActors అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇది మన దేశంలో మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా తెలుగులో హిట్టైన తమిళంలో రీమేక్ చేసిన వాటి గురించి గుర్తు చేస్తున్నారు. విజయ్-మహేష్ బాబు, ‘పవన్ కళ్యాన్- విజయ్, అజిత్- ప్రభాస్ గెటప్స్  పోస్ట్ చేస్Set featured imageతున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీస్‌లో కూడా హీరోల మధ్య ఫ్యాన్ వార్ కామన్. తెలుగులో మెగా, నందమూరి హీరోల మధ్య ఇలాంటి ఫ్యాన్ వారే ఉంది. తాజాగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా, ‘అల వైకుంఠపురములో’ సినిమా కలెక్షన్స్ విషయంలో ఇరు అభిమానుల మధ్య కలెక్షన్స్ వార్ నడుస్తోంది.ఇక తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, ఆ తర్వాత అజిత్, విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఈ మాటల యుద్ధాలు అభిమానుల వరకే ఉంటాయన్నారు. రెండు ఇండస్ట్రీకి చెందిన హీరోల మధ్య అలాంటివి ఏవి ఉండవని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడి హీరోలు.. అక్కడి కథానాయకుల గురించి గొప్పగా చెబుతుంటారు. అక్కడి కథానాయకులు.. ఇక్కడి హీరోల గురించి గొప్పగా చెబుతుంటరాని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్ చివరకు ఎక్కడికి వెళుతుందో చూడాలి.

First published: January 23, 2020, 8:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading