Home /News /movies /

FAN NAMED JAIRAJ CREATES AN ARTISTIC PORTRAIT OF RAMCHARAN SB

Ram Charan: తెలంగాణ అభిమాని చేసిన పనికి.. మురిసిపోయిన రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ కోసం జైరాజ్ అనే తెలంగాణకు చెందిన వ్యక్తి... తాను పండించిన బియ్యాన్ని తీసుకొని వచ్చాడు. బియ్యంతో చరణ్ బొమ్మ కూడా గీశాడు.

    మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ (Mega Fans)ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు తమ అభిమాన హీరో కోసం కొందరు జనాలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రామ్ చరణ్(Ram Charan) విషయంలో అలాంటి ఆసక్తికర ఘటనే ఒకటి జరిగింది. తాజాగా మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. ఏకంగా చరణ్‌ను కలిసేందుకు నడిచి వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 264 కిలోమీటర్లు నడిచాడు. దీంతో అతడ్ని చూసిన చెర్రీ ఆనందం వ్యక్తం చేశాడు.

    తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి. తెలంగాణ(Telangana)లోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని బియ్యపు గింజలతో ఇలా చాటుకున్నాడు. అంతేకాదు.. జైరాజ్ ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్‌(Ram Charan)ను కలుసకున్నాడు.   చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు.


    దీంతో ఇప్పడు జైరాజ్ వేసిన రామ్ చరణ్ బొమ్మతో పాటు... ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తను చూసిన మెగా అభిమానులు.. మాకు కూడా కలిసేందుకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. రామ్ చరణ్‌ను కోరుతున్నారు. ఇక జైరాజ్ అభిమానానికి కూడా సెల్యూట్ కొడుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. నడిచివస్తే కాని.. రామ్ చరణ్ అభిమానుల్ని కలవడా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

    రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాల్లో బిజీగా మారాడు. ఆచార్య తర్వాత చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో ఆర్15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ చిత్రంలో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.అయితే చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ కాదు , ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో చరణ్ నటిస్తున్నాడని,అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mega Family, Ram Charan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు