నాగ చైతన్య కంటే సమంత అక్కినేనిని ఎక్కువగా లవ్ చేసిందెవరో తెలుసా..?

సమంత అక్కినేని (Samantha Akkineni) మీద ప్రేమతో విశాఖపట్నానికి చెందిన శృతి అనే యువతి ఐ లవ్ యూ సామ్ అంటూ పుస్తకాన్ని నింపేసింది. అంతేకాదు.. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సమంతను ట్యాగ్ చేసింది.

news18-telugu
Updated: January 30, 2020, 11:37 AM IST
నాగ చైతన్య కంటే సమంత అక్కినేనిని ఎక్కువగా లవ్ చేసిందెవరో తెలుసా..?
సమంత (Photo:Twitter)
  • Share this:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ ఎవరంటే నాగ చైతన్య, సమంత అక్కినేని. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయంటే చాలు.. అభిమానులు జోరుగా షేర్ చేస్తారు. సమంతకైతే ప్రాణాలు తీసుకునేంత అభిమానం ఉంది ఎందరికో. పెళ్లైనా సరే.. ఆమెకు తమదైన శైలిలో ప్రపోజ్ చేయాలని కోరుకునే అభిమానులూ ఉన్నారు. అయితే.. కొందరు ఆ అభిమానాన్ని చూపించే తీరు నటులకూ, నాయికలకూ తెగ నచ్చేస్తుంది. మొన్నకి మొన్న పూజా హెగ్డే కోసం ముంబైలో ఐదు రోజుల పాటు పుట్‌పాత్‌పై పడుకొని, ఆమె కోసం వేచి చూడగా.. ఇప్పుడు సమంత కోటి రాసిందో అభిమాని.

విశాఖపట్నానికి చెందిన శృతి అనే యువతి ఐ లవ్ యూ సామ్ అంటూ పుస్తకాన్ని నింపేసింది. అంతేకాదు.. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సమంతను ట్యాగ్ చేసింది. ‘ఇది రాయడానికి 3 గంటల 15 నిమిషాల సమయం తీసుకున్నా. మా అమ్మ తిడుతున్నా వినలేదు నేను. నీపై ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలీదు గానీ ఎప్పటికీ అంతం కాదు.’ అని కామెంట్ చేసింది.

దీనికి మురిసిపోయిన సమంత.. ఆ అభిమానికి ఆసక్తికర రిప్లై ఇచ్చింది. ‘మీ అమ్మ నన్ను కచ్చితంగా తిడుతుంది. నీకు నా పై ఉన్న ప్రేమకు కృతజ్ఞురాలిని. కాకపోతే చదువుకో ప్లీజ్’ అని కోరింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రీట్వీట్లతో హోరెత్తుతోంది. నాగ చైతన్య కంటే ఈ అమ్మాయే ఎక్కువగా లవ్ చేసి ఉంటుందంటూ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు.First published: January 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు