అంబరీశ్ పై అభిమానంతో ఆయన కొడుకు తొలి సినిమా టిక్కెట్‌ను లక్షల్లో కొనుగోలు చేసిన అభిమాని..

తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఏమి చేయడానికైన తెగించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్  ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది.

news18-telugu
Updated: May 30, 2019, 11:20 AM IST
అంబరీశ్ పై అభిమానంతో ఆయన కొడుకు తొలి సినిమా టిక్కెట్‌ను లక్షల్లో కొనుగోలు చేసిన అభిమాని..
తల్లి తండ్రులు సుమలత అంబరీశ్‌తో అభిషేక్ అంబరీశ్
  • Share this:
తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఏమి చేయడానికైన తెగించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్  ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై కర్ణాటక సినీ ప్రియుల్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంతో దావణగిరె ప్రాంతానికి చెదిన మంజునాథ్ అనే వ్యక్తి తన కుమారుడికి అదిరిపోయే బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం అంబరీశ్ కొడుకు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్ ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రూ. లక్ష రూపాయలతో కొనుగోలు చేసాడు.

Fan Buys Ticket Worth Rs 1 Lakh for Debut Film of Late Ambareesh's Son,amar kannada movie,abhishek ambarish,sumalatha amabarish,fans buy a ticket,fans spend 1 lackh to abhishek ambarish first movie amar,ticketdarshan amar kannada movie,amar kannada new movie,ambarish son,ambarish son abhishek movie teaser,first movie muhurta samarambha,kannada new movie,ambarish,abhishek amar movie,kannada movies,abhishek ambarish amar movie,ambarish kannada hd movie,ambarish kannada all movie,darshan next movie,abhishek amar kannada movie,abhishek ambarish movie trailer,అంబరీశ్,సుమలత అంబరీశ్,అభిషేక్ అంబరీశ్,అభిషేక్ అమర్ కన్నడ మూవీ,అమర్ టికెట్ ను రూ లక్షకు కొనుగోలు చేసిన కన్నడ అభిమాని,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,
సుమలత అంబరీశ్


ఇక సదురు అంబరీశ్ అభిమాని సందేశ్ ప్రొడక్షన్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ సంస్థ పేరు మీద మంజునాథ్ ఈ టికెట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. అంబరీశ్ కొడుకు అభిషేక్ నటించిన ‘అమర్’ చిత్ర విషయానికొస్తే..ఈసినిమాను నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివంగత అంబరీశ్ అతిథి పాత్రలో నటించారు. తన కుమారుడి తొలి సినిమా చూడకుండానే అంబరీశ్ కన్నుమూసారు. తాజాగా అంబరీశ్ సతీమణి..కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. 52 ఏళ్ల తర్వాత కర్ణాటకలో ఒక మహిళ స్వతంత్య్ర అభ్యర్ధిగా గెలవడం ఇపుడే. తాజాాగా సుమలత కార్యకర్తల అభీష్టం మేరకు అధికార బీజేపీలో జాయిన్ కానున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 30, 2019, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading