హోమ్ /వార్తలు /సినిమా /

ఇలియానా వర్జినిటీని ప్రశ్నించిన అభిమాని.. దిమ్మదిరిగే జవాబిచ్చిన గోవా బ్యూటీ..

ఇలియానా వర్జినిటీని ప్రశ్నించిన అభిమాని.. దిమ్మదిరిగే జవాబిచ్చిన గోవా బ్యూటీ..

Ileana D'Cruz: ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో #askmeanything అని అభిమానులతో ఛాటింగ్ చేసింది. వారితో తన సినిమాలు, ఇష్టాయిష్టాలు తదితరాలను పంచుకుంది. అయితే, ఓ అభిమాని ఇలియానాను ఇబ్బంది పెట్టేలా ‘మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?’ అని ప్రశ్నించాడు.

ఇంకా చదవండి ...

  తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగు వెలిగిన నటి.. ఇలియానా. తన నడుము అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఇల్లీ బేబీ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ మధ్యే తన భాగస్వామి ఆండ్రూ నుంచి వేరుగా ఉంటోందని ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాల్లో అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. అయితే, బొద్దుగా ఉన్నావని, సన్నగా మారాలని సలహా ఇవ్వడంతో ఇప్పుడు జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో #askmeanything అని అభిమానులతో ఛాటింగ్ చేసింది. వారితో తన సినిమాలు, ఇష్టాయిష్టాలు తదితరాలను పంచుకుంది.

  (Image: Ileana D'Cruz/ Facebook)

  అయితే, ఓ అభిమాని ఇలియానాను ఇబ్బంది పెట్టేలా ‘మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?’ అని ప్రశ్నించాడు. దీంతో ఈ గోవా బ్యూటీ కాస్త ఘాటుగా జవాబిచ్చింది. ‘వావ్.. ఈ ప్రశ్నకు మీ అమ్మ ఏమని చెబుతుంది!!’ అని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. కాగా, గతంలోనూ తన వ్యక్తిగత విషయాలపై ట్రోల్స్ వచ్చిన సందర్భంలో వారికి తనదైన శైలిలో జవాబిచ్చిందీ భామ. మరోవైపు, టైగర్ ష్రాఫ్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మీరు వర్జిన్‌యేనా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఇలాంటివి అడగడానికి సిగ్గు లేదా.. నా ఇన్‌స్టాగ్రామ్‌ను నా తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారు’ అని గట్టిగానే ఇచ్చుకున్నాడు.

  First published:

  Tags: Bollywood, Hindi Cinema, Ileana D'cruz, Instagram, Tollywood

  ఉత్తమ కథలు