తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చిన గేయ రచయత సుద్దాల అశోక్ తేజ..

ప్రముఖ గేయ రచయత సుద్దాల అశోక్ తేజ.. కొన్ని రోజులు క్రితం కాలేయ సంబంధిత చికిత్స చేసుకున్నాడు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ.. తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చాడు.

news18-telugu
Updated: July 8, 2020, 10:52 PM IST
తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చిన గేయ రచయత సుద్దాల అశోక్ తేజ..
సుద్దాల అశోక్ తేజ(File)
  • Share this:
ప్రముఖ గేయ రచయత సుద్దాల అశోక్ తేజ.. కొన్ని రోజులు క్రితం కాలేయ సంబంధిత చికిత్స చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిన్న కొడుకు అర్జున్ తేజ కాలేయం దానం చేయగా... గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బుధవారం ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పాటు అభిమానుల ఆశీస్సులతో  నాకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తైయిందన్నారు. ఆపరేషన్ తర్వాత నేను పూర్తిగా ఇంట్లోనే ఉన్నాను. కరోనా నేపథ్యంలో ఎక్కడ బయట కనబడలేదు. దీంతో తన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి.తన ఆరోగ్యం విషమించినట్టు ఏదో న్యూస్‌లో వచ్చినట్టు సన్నిహితులు తనతో  వ్యాఖ్యానించారు. దీనిపై క్లారిటీ ఇవ్వడానికే తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పాటలు కూడా రాయబోతున్నట్టు  చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నాడు.

సుద్దాల అశోక్ తేజ (suddala ashok teja)
సుద్దాల అశోక్ తేజ (suddala ashok teja)


అశోక్ తేజ్ విషయానికొస్తే..  తెలుగులో కే.రంగారావు దర్శకత్వంలో తనికెళ్ల భరణి మాటలు రాసిన ‘నమస్తే అన్న’ సినిమాతో గేయ రచయతగా సినీ ప్రస్థానం మొదలుపెట్టారు  సుద్దాల అశోక్ తేజ్. ఆ తర్వాత ఎన్‌కౌంటర్, ఒసేయ్ రాములమ్మ,శ్రీరాములయ్య చిత్రాలు ఆయనకు గేయ రచయతగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘ ఠాగూర్’ సినిమాలోని నేను సైతం పాటకు జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. తెలుగులో మహాకవి శ్రీశ్రీ,  తర్వాత వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న మూడో గేయ రచయత సుద్దాల అశోక్ తేజ.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 8, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading