ముగిసిన కార్తీక దీపం సీరియల్...వంటలక్క ఫ్యాన్స్ ఆందోళన...

కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు.

news18-telugu
Updated: October 19, 2019, 9:50 PM IST
ముగిసిన కార్తీక దీపం సీరియల్...వంటలక్క ఫ్యాన్స్ ఆందోళన...
కార్తీకదీపం (Image: Star maa)
news18-telugu
Updated: October 19, 2019, 9:50 PM IST
తెలుగునాట అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో సీరియల్ అభిమానులు ఏం జరిగిందా అనే సస్పెన్స్ లో ఉన్నారు. కానీ కార్తీక దీపం తెలుగులో ముగియలేదని, మళయాల మాతృక కారుముత్తు మాత్రం ముగిసిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడు సంవత్సరాలుగా అలరించిన కారుముత్తు (కార్తీకదీపం) ముగిసింది.

(Image: star maa)


అయితే తెలుగు కార్తీక దీపం సీరియల్ కి, మళయాళ కారుముత్తుకి మధ్య కథలో కాస్త మార్పులు ఉన్నప్పటికీ రెండు సీరియల్స్ మూల కథ ఒక్కటే...మళయాళంలో కార్తీక్ దీప విడిపోవడం, దీప గతం మర్చిపోయి..వేరే వ్యక్తిని ప్రేమించడం, కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో కెనడా వెళ్లిపోవడం, చివరకు గతం గుర్తుకువచ్చిన దీప తిరిగి కార్తీక్ ను వెతుక్కుంటూ అత్తగారు సౌందర్య ఇంటికి రావడం, చివరకు అంతా కార్తీక్, దీప కలవడంతో సీరియల్ ముగిసింది. అయితే తెలుగులో ఇప్పటికే 3 సంవత్సరాల సీరియల్ పూర్తి అయినప్పటికీ, మళయాళం కథనం ప్రకారం సీరియల్ పూర్తి కావాలంటే ఇంకా 4 సంవత్సరాలు మినిమం పట్టే అవకాశం ఉంది. సో...వంటలక్క ఫ్యాన్స్ బీ హ్యాపీ...ఇంకా కథ ముగిసిపోలేదు.

(Image: star maa)


First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...