• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FAMOUS TAMIL PRODUCER K BALU DIES IN CHENNAI DUE TO COVID 19 HERE ARE THE DETAILS TA

కొత్త యేడాదిలో సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

కొత్త యేడాదిలో సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

కరోనాతో ప్రముఖ నిర్మాత కే. మధు (File/Photo)

Producer K Madhu Dies Due to Covid -19 | 2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు.

  • Share this:
    Producer K Madhu Dies Due to Covid -19 | 2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు. ఇక 2021 కొత్త యేడాదిలో అంతా బాగుంటుందనుకుంటే.. కొత్త యేడాది తొలి రోజే..  ప్రముఖ నిర్మాత కన్నుమూయడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రముఖ తమిళ నిర్మాత కే. బాలు జనవరి 1వ తేది రాత్రి గుండెపోటుతో కన్నుమూసారు. రీసెంట్‌గా ఈయన కోవిడ్ బారిన పడ్డారు. దాని కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈయన తమిళంలో ప్రభు, కుష్బూతో తెరకెక్కించిన ‘చినతంబీ’ సినిమాతో పాపులర్ అయ్యారు. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ తెలుగులో ‘చంటి’పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఇదే సినిమాను హిందీలో వెంకటేష్.. తన ఓన్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘అనారీ’గా రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

    చినతంబీతో పాటు తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈయన మృతికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. శరత్ కుమార్, వెంకట్ ప్రభు సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. మరోవైపు కుష్బూ తన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ నిర్మించిన నిర్మాత కే.బాలు కన్నమూయడంపై ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసింది.






    అంతేకాదు ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరిగాయి.

    .
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు