Tamil Actor Florent pereira passed away: కరోనాతో ప్రముఖ తమిళ నటుడు కన్నుమూత..

Tamil Actor Florent pereira passed away: కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కారణంగా ప్రముఖ తమిళ నటుడు కన్నుమూసారు.

news18-telugu
Updated: September 15, 2020, 10:29 AM IST
Tamil Actor Florent pereira passed away: కరోనాతో ప్రముఖ తమిళ నటుడు కన్నుమూత..
ప్రముఖ తమిళ నటుడు కన్నుమూత (File/Photo)
  • Share this:
Tamil Actor Florent pereira passed away: కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఏరోజు కారోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా వేగంగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు  సరాసరి లక్ష కేసులు నమోదువుతున్నాయి. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. కొందరు ఈ మహామ్మారి బారిన పడి కన్ను మూస్తున్నారు. ఇప్పటికే దిలీప్ కుమార్ తమ్ముడు సహా పలువురు ప్రముఖలు కోవిడ్ కారణంగా కన్నుమూసారు. తాజాగా కరోనా మహామ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. తమిళం, మలయాళంలో తన నటనతో ఆకట్టుకున్న ఫ్లోరెంట్ పెరిరా అనే నటుడు కరోనా కారణంగా నిన్న  కన్నుమూసారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.

బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఫ్లోరెంట్ పెరిరా (File/Photo)


తమిళంలో ప్రముఖ కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫ్లోరెంట్ పెరిరాకు మంచి ఇమేజ్ ఉంది. ఈయనకు రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, ముప్పారిమనమ్,సత్రియాన్ వంటి చిత్రాల్లో నటనతో తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఈయన కలైంగర్ టీవీ ఛానెల్‌కు కొన్నాళ్లు జనరల్ మేనేజర్‌గా పనిచేసారు. ఈయన రీసెంట్‌గా భారతీయ జనతా  పార్టీలో చేరి కాశాయ కండువా కప్పుకున్నారు. ఈయన మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 15, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading