Shankar Rao : ప్రముఖ కన్నడ హాస్య నటుడు కన్నుమూత.. ప్రముఖుల నివాళి..

ప్రముఖ కన్నడ హాస్య నటుడు శంకర్ రావు కన్నుమూత (File/Photo)

Shankar Rao : ప్రముఖ కన్నడ హాస్య నటుడు శంకర్ రావు  అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 84 యేళ్లు. వయసు మీదపడటంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈయన సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

 • Share this:
  Shankar Rao : ప్రముఖ కన్నడ హాస్య నటుడు శంకర్ రావు  అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 84 యేళ్లు. వయసు మీదపడటంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈయన సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈయన ఈటీవీ కన్నడలో ప్రసారమయ్యే ‘పాప పాండు’ అనే సీరియల్‌తో ఈయన కమెడియన్‌గా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈయన నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు ఈయన కన్నడలో ప్రఖ్యాత రంగభూమి కళాకారునిగా కూడా ఫేమస్. ఆయన మృతిపై కన్నడ చిత్ర సీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో పలు సినిమాలతో పాటు సీరియల్స్ ఉన్నాయి. ఈయన హఠాన్మరణంతో ఆయా సినిమాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

  ఈయనకు ఇద్దరు పిల్లలున్నారు. గతేడాది ఈయన భార్య కూడా అనారోగ్యంతో కన్నమూసారు. దీంతో ఈయన మానసికంగా మరింత కృంగిపోయారు. అంతేకాదు సినిమాల్లోనే కాదు బయట కూడా ఈయన ఎపుడు అందరినీ నవ్విస్తూ ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈయన మరణంతో కన్నడ హాస్య ప్రపంచంలో ఓ ధృవతార నేలకొరింగిందని పలువురు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  ఈ యేడాది కన్నుమూసిన ఇతర సినీ ప్రముఖుల విషయానికొస్తే.. 

  రీసెంట్‌గా  ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎన్నో తెలుగు సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన మహేష్ కోనేరు గుండెపోటుతో కన్నుమూసారు. ఈయన కంటే ముందు ఈ యేడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా  భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

  Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

  అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు ప్రముఖ హాస్య నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కూడా అనారోగ్యంతో కన్నుమూసారు.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  అటు మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావా కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు. అటు ప్రముఖ పబ్టిసిటీ డిజైనర్ ఈశ్వర్ కూడా ఈ యేడాదే పరమ పదించారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: