• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FAMOUS MARATHI LADY FILM DIRECTOR SUMITRA BHAVE PASSES AWAY AT 78 TA

Director Sumitra Bhave Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ మహిళ దర్శకురాలు మృతి..

Director Sumitra Bhave Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ మహిళ దర్శకురాలు మృతి..

లేడి దర్శకురాలు సుమిత్ర భావే కన్నుమూత (Twitter/Photo)

Director Sumitra Bhave Passes Away: 2020 లాగే 2021 కి కూడా చిత్ర సీమకు కలిసి రాలేదనే చెప్పాలి. తాజాగా చిత్ర సీమలో మరో మహిళ దర్శకురాలు కన్నమూసారు.

  • Share this:
    Director Sumitra Bhave Passes Away: 2020 లాగే 2021 కి కూడా చిత్ర సీమకు కలిసి రాలేదనే చెప్పాలి. మొన్నటి మొన్న ప్రముఖ తమిళ స్టార్ కమెడియన్ వివేక్ మృతి సంగతి మరిచిపోక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మహిళ దర్శకురాలు సుమిత్రా భావే అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె వయసు 78 ఏల్లు. మరాఠీ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు కొత్తగా వచ్చే మహిళ దర్శకులకు స్పూర్తిగా నిలిచారు. వయసుతో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఈమె కొన్నాళ్ల క్రితం పూణేలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం క్షీణించడంతో ఆమె కన్నుమూసారు. సుమిత్రా భావే ఎక్కువగా నటుడు, పాటల రచయత గుర్తింపు తెచ్చుకున్న సునీల్ సుక్తాంకర్‌తో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేసారు. వీరు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్, నాలుగు టీవీ సీరియల్స్‌తో పాటు 17 చిత్రాలను తెరకెక్కించారు. వీటికి సుమిత్రా భావే రైటర్‌గా పనిచేసారు. ఈమెకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించడంతో పాటు ఆమెను వెతుక్కుంటూ పలు అవార్డులు కూడా వచ్చాయి. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు