FAMOUS MALLUWOOD MUSIC DIRECTOR KAITHAPRAM VISWANATHAM DIES DUE TO CANCER AT 58 TA
Kaithapram Viswanatham : చిత్రసీమలో మరో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..
ప్రముఖ సంగీత దర్శకుడు మృతి (File/Photo)
Kaithapram Viswanathan Died | 2021 కి కూడా చిత్ర సీమకు అసలు కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కైతాప్రమ్ విశ్వనాథన్ క్యాన్సర్‌తో కన్నుమూసారు.
Kaithapram Viswanathan Died | 2021 కి కూడా చిత్ర సీమకు అసలు కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు.లుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య.. దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కూడా అనారోగ్యంతో కన్నుమూసారు.
ఈ యేడాది ప్రముఖ సంగీత దర్శకుడు.. నదీం శ్రావణ్‌లో ఒకరైన శ్రావణ్ రాథోడ్ కరోనా కన్నుమూసారు.అటు మరో బాలీవుడ్ నటుడు అమిత్ మిస్త్రీ గుండెపోటుతో కన్నుమూసారు. అటు మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావా కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. అటు ప్రముఖ పబ్టిసిటీ డిజైనర్ ఈశ్వర్ కూడా ఈ యేడాదే కన్నుమూసారు.
ఈ యేడాది సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్‌తో కన్నుమూసారు. తాజాగా అదే క్యాన్సర్ మరో సంగీత దర్శకుడిని బలి తీసుకుంది. మలయాళ సంగీత దర్శకుడు కైతాప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి క్యాన్సర్‌తో కన్నుమూసారు. ఆయన వయసు 58 యేళ్లు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతూ ఈయన నిన్న (బుధ వారం) తుది శ్వాస విడిచారు. ఈయన సంగీతం ఇచ్చి పలు చిత్రాలకు అవార్డులు కూడా వరించాయి.
కైతాప్రమ్ కేరళలోని సంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించారు. ఈయన 1963లో కేరళలోని కన్నూర్ డిస్ట్రిక్‌లో జన్మించారు.ఈయనక స్వాతి తిరునల్ మ్యూజిక్ కాలేజ్ తిరువనంత పురం నుంచి ‘గాన భూషణం’ అనే బిరుదు పొందారు. ఈయన సంగీత దర్శకుడు కాకముందు మ్యూజిక్ కళాకాలో ఆచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత ఈయన అడుగులు సినీ రంగం వైపు మరలాయి. ఈయన రాశీ కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈయన ఎక్కువగా సంగీత ప్రధాన చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు. మలయాలంలో 20కి పైగా చిత్రాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈయన సంగీతం అందించిన కన్నకి చిత్రం 2001లో కేరళ స్టేట్ అవార్డు సాధించింది. ఈయన భార్య గౌరీ.. ముగ్గురు పిల్లలున్నారు. ఈయన మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ప్రతిపక్ష నాయకులు సంతాపం వ్యక్తం చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.