• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FAMOUS MALAYALAM ACTOR CUM SCREENWRITER P BALACHANDRAN PASSES AWAY TA

P. Balachandran passes away: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మలయాళీ నటుడు, స్క్రీన్ రైటర్ బాలచంద్రన్ కన్నుమూత..

P. Balachandran passes away: చిత్ర పరిశ్రమలో మరో విషాదం..  ప్రముఖ మలయాళీ నటుడు, స్క్రీన్ రైటర్ బాలచంద్రన్ కన్నుమూత..

ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు పి.చంద్రన్ కన్నుమూత(File/Photo)

P. Balachandran passes away: ప్రముఖ మలయాళీ నటుడు, స్క్రీన్ రైటర్ బాలచంద్రన్ కన్నుమూసారు. ఈయన మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు.

  • Share this:
    P. Balachandran passes away: ప్రముఖ మలయాళీ నటుడు, స్క్రీన్ రైటర్ బాలచంద్రన్ కన్నుమూసారు. ఈయన మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు. ఈయన వయసు 69 సంవత్సరాలు. గత ఎనిమిది నెలలుగా ఈయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈయన తీవ్ర అస్వస్థతకు గురై కాసేపటి క్రితమే కన్నుమూసారు. ఈయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈయన నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీజర్‌గా పనిచేసారు. ఆ తర్వాత థియేట్రికల్ ఆర్ట్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఈయన 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతోొ స్క్రీన్ రైటర్‌గా  వెండితెరకు పరిచయమయ్యారు.అంతేకాదు ఈ సినిమా తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు. ఈయనకు కళా రంగానికి చేసిన సేవకు గాను  కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ అనే నాటాకానికి అందుకన్నారు.

    ఈయన ‘పునరధివసమ్’ మరియు కమ్మటిపాదమ్’ సినిమాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. పునరధివాసమ్’ సినిమా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు కేరళ స్టేట్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. మరవైపు కమ్మటిపాదం సినిమా కూడా నాలుగు స్టేట్ అవార్డులు గెలుచుకుంది.

    ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు పి.చంద్రన్ కన్నుమూత(File/Photo)


    2012లో ఈయన ‘మేఘరూపమ్’ అనే సినిమాను డైరెక్ట్ చేసారు. ప్రముఖ కేరళ కవి కున్హిరామన్ నాయర్ జీవిత కథ ఆధారంగా  ‘కవియుదే కల్పదుకల్’  ఈయన ఈ సినిమాను తెరకెక్కించాడు. దాదాపు 50కి పైగా మలయాళ చిత్రాలకు ఈయన స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు. ఈయన నటించిన సినిమాల్లో ‘త్రివిండ్రమ్ లాడ్జ్’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా నటించిన ‘వన్’ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. ఈయన అంత్యక్రియలు ఈయన స్వగ్రామం వైకోమ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు