news18-telugu
Updated: December 2, 2020, 10:07 PM IST
అనంత శ్రీరామ్ (File/Photo)
Ananta Sriram | అనంత శ్రీరామ్ తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి వెయ్యికి పైగా పాటలు రాసిన ఘనత దక్కించుకున్నారు. వాళ్ల తాతగారు హరిరామజోగయ్య ప్రముఖ నిర్మాత కావడంతో ఆయనకు సినీ రంగ ప్రవేశం కొంచెం సులువుగా దక్కింది. ఆ తర్వాత తనదైన పాటలతో ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తెలుగులో ‘బాహుబలి’తో సహా వందలాది చిత్రాలకు అద్భుతమైన సాహిత్యం అందించారు. అంతేకాదు తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలకు పాటలు రాసిన ట్రాక్ రికార్డు అనంత శ్రీరామ్ సొంతం. ముప్పై ఐదేళ్ల వయస్సులోనే ఇంతటి ఖ్యాతి సంపాదించడం అంత తేలిక కాదు. తాను రాసిన పాటలకు ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు అందుకున్నారు శ్రీరామ్. ఈయన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘సాక్ష్యం’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించి యాక్టర్‌గా సత్తా కూడా చాటాడు.
అయితే.. ఆయనకు సంబంధించిన ఓ అతి రహస్యాన్ని ఆయనే ఓ టీవీ ఇంటర్వ్యూ లో బయట పెట్టారు. చిన్నతనం నుంచి తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకొని సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న శ్రీరామ్ 11 ఎళ్ల ప్రాయం నుంచి రచనలు చెయ్యడం మొదలు పెట్టారట. చక్కని కవితలు, పాటలు రాసేవారట. ఇదే అదనుగా అనంత శ్రీరామ్ స్నేహితులు వాళ్ళ ప్రియురాళ్ల కోసం ఈయనతో ప్రత్యేకంగా ప్రేమ లేఖలు రాయించుకునే వారట. అలా చాలా మందికే లేఖలు రాసిపెట్టిన శ్రీరామ్‌కు ఎలాంటి ప్రేమ వ్యవహారంలో చిక్కుకోకపోవడం విచిత్రమనే చెప్పాలి. అందుకే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు శ్రీరామ్.

ప్రముఖ గేయ రచయత అనంత శ్రీరామ్ (File/Photo)
అయితే.. తాను మాత్రం తనకున్న రచనా పరిజ్ఞానంతో కాలేజీ రోజుల నుంచి డబ్బు సంపాదించడం అపుడే మొదలు పెట్టాడట. స్నేహితులకు ప్రేమ లేఖలు రాసిపెట్టి ఒక్కో లేఖకు రూ. 250 వసూలు చేసే వారట. క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రం 50 శాతం డిస్కౌంట్ ఇచ్చి 125 రూపాయలు వసూలు చేసేవాన్నని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
తాను అలా చాలా మందికి లేఖలు రాసిపెట్టనని... వారులో కొంత మందే పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలైన విషయాన్ని చెప్పుకొచ్చారు అనంత శ్రీరామ్.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 2, 2020, 10:07 PM IST