Upendra: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రకు అరుదైన గౌరవం..

దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్రకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోెకి వెళితే..

news18-telugu
Updated: August 16, 2019, 9:01 AM IST
Upendra: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రకు అరుదైన గౌరవం..
ఉపేంద్ర
news18-telugu
Updated: August 16, 2019, 9:01 AM IST
కన్నడ నటుడు ఉపేంద్ర అందరి హీరోల్ల ఒక మూసలో ఉండే రకం. ఆయనతో డిఫరెంట్ స్కూల్. అంతేకాదు పిచ్చెక్కిపోయే ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా సినిమా తీసేసి దాహం తీర్చుకునే కథానాయకుడు ఉపేంద్ర. దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్రకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోెకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ దర్శకుల్లో ఉపేంద్ర ఒకరిగా నిలిచారు. ఈయన మొత్తంగా 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బి.ఎం.డి.బీ (ది బెస్ట్ మూవీ డాటా బేస్) అనే సంస్థ మన దేశంలో ఇప్పటి వరకు ఉత్తమ దర్శకుల జాబితాను రెడీ చేసింది. ఇందులో మొత్తంగా 50 మంది దర్శకుల పేర్లు ఉన్నాయి. వాటిలో ఉపేంద్రకు 17వ స్థానంలో నిలిచారు. ఈ డేటా బేస్‌లో రాజ్ కుమార్ హిరాణికి రెండో ప్లేస్‌ దక్కింది. మరోవైపు మన దేశంలోనే అత్యుత్తమ దర్శకుడిగా పేరొందిని సత్యజిత్ రే 49వ స్థానంలో నిలిచారు. మొత్తంగా మన దేశం నుంచి ఈ ముగ్గురుకి మాత్రమే ఇందులో స్థానం దక్కింది. ఈ లిస్టులో ప్లేస్ దక్కించుకున్న సౌత్ ఇండియాకు చెందిన దర్శకుడు ఉపేంద్ర కావడం విశేషం.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...