Mani ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు హార్ట్ ఎటాక్.. హాస్పటల్‌కు తరలింపు..

Mani ratnam | దక్షిణాదికి చెందిన ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం మరోసారి గుండెపోటుకు గురయ్యారు. ఇలా మణిరత్నం హార్ట్ ఎటాక్‌కు గురి కావడం నాల్గోసారి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు.

news18-telugu
Updated: June 17, 2019, 2:16 PM IST
Mani ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు హార్ట్ ఎటాక్.. హాస్పటల్‌కు తరలింపు..
మణిరత్నం (ఫైల్ ఫోటో)
  • Share this:
దక్షిణాదికి చెందిన ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం మరోసారి గుండెపోటుకు గురయ్యారు. ఇలా మణిరత్నం హార్ట్ ఎటాక్‌కు గురి కావడం నాల్గోసారి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉన్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వార్తపై స్పందించారు. మణిరత్నంకు తొలిసారి 2004లో ‘యువ’ షూటింగ్‌లో వచ్చింది. సెట్‌లో ఛాతిలో నొప్పి రాగా.. వెంటనే హాస్పిటిల్‌కు షిప్ట్ చేయడంతో ఆయనకు ఈ గండం నుంచి బయట పడ్డారు. ఆ తర్వాత 2015లో ‘కాదల్ కణ్మణి’ (ఓకే బంగారం) షూటింగ్ సమయంలో సెకండ్ టైమ్ కాశ్మీర్‌లో మరోసారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత మణిరత్నాన్ని హుటాహుటిని ఢిల్లికి తరలించి చికిత్స అందించడంతో ఆయన రికవరీ అయ్యారు. గతేడాది కూడా ఆయనకు హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అప్పట్లో కుటుంబ సభ్యులు రొటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పటిల్‌కు వచ్చినట్టు చెప్పారు.

Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
మణిరత్నం


మణిరత్నాన్ని చెన్నైలోని గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ‘బాహుబలి’ రేంజ్‌లో తెరకెక్కే ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన అగ్రనటీనటులు నటించేందకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు  నుంచి మోహన్ బాబు, నాగార్జున వంటి నటులు ఈ సినిమాలో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. మణి రత్నానికి  భార్య సుహాసిని, ఒక కుమారుడు వున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 17, 2019, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading