Kangana Ranaut: కంగనా రనౌత్ .. బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై ఓరేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె పై కక్ష్య కట్టి మరి ఆమె ఉంటున్న నివాసాన్ని కూల్చినా.. ఎక్కడ వెరవకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఐతే.. తాజాగా కంగనా పై ప్రముఖ బాలీవుడ్ సినీ, గేయ రచయత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేసారు. కంగనా రనౌత్ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక అనవసరంగా తన పేరును లాగారని ఆరోపిస్తూ జావేద్ అక్తర్.. కంగనా రనౌత్ పై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసారు. కంగనా పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేయాలని జావేద్ అక్తర్ కోరారు.
ఒక ఈ కేసులో తనపై అనవసరంగా బురద చల్లినట్టు కంగనా మాట్లాడిన వీడియో క్లిప్పింగులను జావేద్ అక్తర్ జత చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కంగనా పై పరవు నష్టం కేసును ఈ నెల 19కు కోర్డు వాయిదా వేసింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 03, 2020, 17:09 IST