• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FAMOUS BOLLYWOOD EDITOR AJAY SHARMA DIED DUE TO COVID 19 TA

Editor Ajay Sharma Died: సినీ ఇండస్ట్రీలో ఆగని కోవిడ్ మరణ మృదంగం.. కరోనాతో మరో ఎడిటర్ మృతి..

Editor Ajay Sharma Died: సినీ ఇండస్ట్రీలో ఆగని కోవిడ్ మరణ మృదంగం.. కరోనాతో మరో ఎడిటర్ మృతి..

కరోనాతో ప్రముఖ సినిమా ఎడిటర్ కన్నుమూత (File/Photo)

Editor Ajay Sharma Died: సినీ ఇండస్ట్రీలో ఆగని మరణ మృదంగం. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అనే భాషా భేదం లేకుండా ఒక్కొక్కరుకు కరోనా తాకిడికి బలైపోతున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు కరోనాతో కన్నుమూసారు.

  • Share this:
    Editor Ajay Sharma Died: సినీ ఇండస్ట్రీలో ఆగని మరణ మృదంగం. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అనే భాషా భేదం లేకుండా ఒక్కొక్కరుకు కరోనా తాకిడికి బలైపోతున్నారు.  తాజాగా  మరో ఎడిటర్ కన్నుమూసారు.  2020లోనే ఎంతోమంది కరోనా కాటుకు బలైపోయారు.  2021లో నైనా అంతా బాగుంటుంది అనుకుంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ దేశ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది.  కొన్ని రోజుల క్రితం తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ మరణించారు.ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కే.వి.ఆనంద్ గుండెపోటుతో మరణించారు. అంతకు ముందు తమిళ క్యారెక్టర్ చెల్లాదురైతో పాటు ప్రముఖ అప్ కమింగ్ దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో కన్నుమూసారు. ఈ గురువారం పాండు అనే తమిళ సీనియర్ కమెడియన్ కరోనా కన్నమూసారు. ఈ సంగతి మరవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ బుధవారం బాలీవుడ్ సినీ ఎడిటర్ అజయ్ శర్మ కోవిడ్‌తో కన్నమూసారు. ఆయన వయసు 30 యేళ్లు. ఈయన ‘లూడో’, ‘జగ్గా జాసూస్’, ‘కార్వాన్’ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసారు. ప్రస్తుతం ఈయన తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘రష్మీ రాకెట్’ సినిమాకు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. అజయ్ శర్మకు భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తక్కువ ఏజ్‌లో ఈయన కరోనాతో కన్నమూయడం బాధాకరమన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు