Home /News /movies /

FAMOUS BENGALI AND TOLLYWOOD FILM DIRECTOR TARUN MAJUMDAR PASSES AWAY TA

Director Tarun Majumdar Passes Away : చిత్ర సీమలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత..

ప్రముఖ చిత్ర దర్శకుడు మృతి (File/Photo)

ప్రముఖ చిత్ర దర్శకుడు మృతి (File/Photo)

Director Tarun Majumdar Passes Away : 2022లో టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగాలీలో ఎన్నో సంచలన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ మజుందార్ అనారోగ్యంతో కన్నుమూసారు.

    Director Tarun Majumdar Passes Away : 2022 కూడా భారతీయ  చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.  ముఖ్యంగా ఈ ఇయర్  భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ  తో పాటు ప్రముఖ తెలుగు దర్శకులు శరత్, తాతినేని రామారావు వంటి మేటి డైరెక్టర్స్ కూడా ఈ యేడాదే ఈ లోకాన్ని నిష్క్రమించారు. తాజాగా ఈ కోవలో మరో మేటి దర్శకుడు తుది శ్వాస విడిశారు.

    సినిమాలే ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా బతికిన ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ వయసు రీత్యా ఏర్పడిన  అనారోగ్య సమస్యలతో కోల్‌కతాలోని SSKM హాస్పిటల్‌లో  కన్నుమూసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఈయనకు డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే ఈయన అవయవాలేవి స్పందించకపోవడంతో ఈయన చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేశారు.  ఈయన వయసు 92 సంవత్సరాలు. 1960 దశకంతో పాటు 70.80లలో ఈయన తెరకెక్కించిన చిత్రాలు బెంగాలీ చిత్రసీమలో సంచనలనం రేపాయి. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో తెరెక్కిన పాల్ తక్,  కుహెలి, బాలికా బధు, దాదర్ కీర్తి, శ్రీమాన్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు అప్పటి తరం ప్రేక్షకులను అలరించాయి.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమ మాదిరే బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్‌గా పిలుస్తారు. అక్కడ కోల్‌కతాలోని టోలీగంజ్‌లో చిత్రసీమ స్థిరపడటంతో అక్కడ చిత్రసీమను అందరు టాలీవుడ్‌ అని పిలవడం మొదలు పెట్టారు.



    1931 జనవరి 8 అప్పటి బ్రిటిష్ ఇండియా బెంగాల్ ప్రెసిడెన్సీ లో జన్మించారు. ఈయన అప్పట్లో సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీ వంటి వారితో చేతులు కలిపి యాత్రిక్ అనే స్క్రీన్ నేమ్‌తో సినిమాలు తెరకెక్కించారు. 1959లో తెరకెక్కిన ‘చావా పావా’ దర్శకుడిగా తొలి చిత్రం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచెర్ స్వార్గో, నిమంత్రణ్, గాన దేవత, అరణ్య అమర్ వంటి చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. సినీ రంగానికి ఈయన సేవలకు గాను 1990లో కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మశ్రీతో సత్కరించింది. ఈయన మరణంతో బెంగాలీ చిత్రసీమలో ఒక శకం ముగిసింది. ఈయన మృతిపై  అని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bengali cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు