Pawan Kalyan- Anand Sai: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి వరుస ట్రీట్లను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వరుసగా ఐదు చిత్రాలను ప్రకటించారు పవన్. అందులో వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో.. రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇవి రెండు పూర్తి అవ్వగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ మూవీలోనూ కనిపించనున్నారు. అంతేకాదు మరికొన్ని స్క్రిప్ట్‌లను ఆయన వింటున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికి తన అభిమానులకు వరుసగా ఎంటర్టైన్ చేయనున్నారు పవన్. ఇదిలా ఉంటే ఇందులో ఓ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్రెండ్ తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సమయాన్ని కేటాయించిన ఆ సాంకేతిక నిపుణుడు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్లోకి వస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, పవన్ కల్యాణ్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ నటించిన తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ, జల్సా చిత్రాలకు ఆయన పనిచేశారు. అంతేకాదు మిగిలిన హీరోలతోనూ ఆయన పని చేశారు. అయితే గత ఐదేళ్లుగా ఆయన యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ మూవీ కోసం మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
Magnificent Art Director Anand Sai garu is back to Cinema after dedicating his 5 years of craftsmanship for Yadadri Temple - The Pride of Telangana!
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న చిత్రం కోసం ఆనంద్ సాయి పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవన్ ఇంతవరకు కనిపించని పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.