FAKE NEWS GOING ROUNDS ON MEGA HERO SAI DHARAM TEJ ABOUT HIS HEALTH AND MARRIAGE PK
Fact Check: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై పుకార్లు.. అసలు విషయం ఇదీ..
సాయి ధరమ్ తేజ్ (Twitter/Sai Dharam Tej)
Sai Dharam Tej: ఈ రోజుల్లో ఏ మాత్రం అనారోగ్యం అనే మాట వినిపిస్తే భయపడుతున్నారు అభిమానులు. ముఖ్యంగా హీరోలకు ఏదైనా అయిందంటే మాత్రం కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనారోగ్యంతో..
ఈ రోజుల్లో ఏ మాత్రం అనారోగ్యం అనే మాట వినిపిస్తే భయపడుతున్నారు అభిమానులు. ముఖ్యంగా హీరోలకు ఏదైనా అయిందంటే మాత్రం కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మొన్నటి వరకు షూటింగ్ కూడా చేసాడు అప్పుడే ఏమైంది అంటూ టెన్షన్ పడుతున్నారు. పైగా కరోనా కాలం కావడంతో ఏ మాత్రం అనారోగ్యం అని వినిపించినా కూడా లేనిపోని భయం మొదలవుతుంది. ఇప్పుడు సాయి విషయంలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. `సోలో బ్రతుకే సో బెటరు` సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడటానికి కారణం కూడా ఇదేనంటూ ప్రచారం మొదలైంది. అయితే దీనిపై సాయి ధరమ్ తేజ్ పిఆర్ టీం మాత్రం మరోలా స్పందించింది.
సాయి ధరమ్ తేజ్ (Twitter/Sai Dharam Tej)
అసలు సాయికి అలాంటి అనారోగ్య సమస్యలు ఏం లేవని.. కావాలనే కొందరు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని చెప్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నిక్షేపంగా ఉన్నాడని.. తన సినిమాలతో పాటు పర్సనల్ స్పేస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడని అనవసరం లేనిపోని వార్తలు రాసి అభిమానులను కంగారు పెట్టొద్దంటూ సాయి సన్నిహితులు చెప్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ (Twitter/Sai Dharam Tej)
సోలో బ్రతుకే సో బెటరూతో పాటు దేవా కట్టా సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు ఈయన. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈయన చేతిలో ఉన్నాయి. అనారోగ్యం అనేది పుకారు అయితే పెళ్లి అనేది మరో పుకారు అని వాళ్లు తేల్చేసారు. తనపై వచ్చిన ఈ పెళ్లి న్యూస్ చూసి సాయి ధరమ్ తేజ్ కూడా నవ్వుకున్నాడని ఆయన స్నేహితులు చెప్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ (Twitter/Sai Dharam Tej)
అనవసరంగా తమ హీరోపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సాయి ధరమ్ తేజ్ వర్గం కూడా చెబుతున్న మాట. పెళ్లి టాపిక్ పక్కదారి పట్టించడానికి ఉన్నట్లుండి అనారోగ్యం అంటూ మరో కథ రాసారని.. నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు సాయి సన్నిహితులు. ఏదేమైనా కూడా మెగా మేనల్లుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని.. అనారోగ్యం అనే మాటే లేదని తేల్చేసారు వాళ్లు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.