Home /News /movies /

FAKE NEWS CIRCULATING ON LEGENDARY ACTOR KAIKALA SATYANARAYANA DEATH AND DAUGHTER GETS SERIOUS PK

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మరణించారంటూ ప్రచారం.. తప్పుడు వార్తలపై కూతురు సీరియస్..

కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayna)

కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayna)

Kaikala Satyanarayana: సీనియర్ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) గత మూడు రోజులుగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ ఇప్పటికే వైద్యులు కూడా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.

ఇంకా చదవండి ...
సీనియర్ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ గత మూడు రోజులుగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ ఇప్పటికే వైద్యులు కూడా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆయన కోలుకోవాలంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మంది సినీ ప్రముఖులు కూడా కైకాలను హాస్పిటల్ వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే అంతలోనే ఆయన మరణించారంటూ కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈయన చనిపోయారంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు కొందరు. మూడు రోజులుగా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు కూడా. అయితే కైకాల సత్యనారాయణ మరణించలేదని తర్వాత తెలిసింది.

తొందరపాటుతో ఈయన ఆరోగ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేసాయని అర్థమైంది. ఈ మొత్తం ఘటనపై ఆయన కూతురు రమా దేవి సీరియస్ అయ్యారు. తన తండ్రి కైకాల సత్యనారాయణ బాగానే ఉన్నారని.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని.. ఆయన బాగానే ఉన్నారని.. ఈ అబద్ధాలను నమ్మొద్దంటూ ఈమె కోరారు. తన తండ్రిపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమే అని.. ఆయన ఆరోగ్యం రోజురోజుకీ మెరుగు పడుతుందని ఆమె తెలిపారు. హాస్పిటల్‌కు వచ్చిన నటుడు మాదాల రవికి ఆయన థమ్స్ అప్ సింబల్ కూడా చూపించారని.. కచ్చితంగా ఆయన కోలుకుని బయటికి వస్తారంటూ చెప్పుకొచ్చింది ఈమె. 86 ఏళ్ళ కైకాల కొన్ని రోజుల కింద ఇంట్లో జారి పడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతింది. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైగానే నటించారు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kaikala Satyanarayanam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు