సంక్రాంతి సినిమాల్లో అత్యంత దారుణమైన టాక్‌తో ఓపెన్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘వినయ విధేయ రామ’ సినిమానే. ఫ్యాన్స్‌కు ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఎందుకంటే అది వాళ్లకు కూడా తెలుసు కాబట్టి. అభిమానులు కూడా ఈ సినిమాను చూసి తొలిరోజు దర్శకుడు బోయపాటి శీనుతో పాటు రామ్ చరణ్‌ను కూడా విమర్శించారు.
సంక్రాంతి సినిమాల్లో అత్యంత దారుణమైన టాక్‌తో ఓపెన్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘వినయ విధేయ రామ’ సినిమానే. ఫ్యాన్స్‌కు ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఎందుకంటే అది వాళ్లకు కూడా తెలుసు కాబట్టి. అభిమానులు కూడా ఈ సినిమాను చూసి తొలిరోజు దర్శకుడు బోయపాటి శీనుతో పాటు రామ్ చరణ్‌ను కూడా విమర్శించారు. అసలేముందని ఈ సినిమాను చరణ్ ఒప్పుకున్నాడు అంటూ ఆడుకున్నారు.. అదే సమయంలో బోయపాటి శ్రీనుపై అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ భారీగా వచ్చాయి.
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
ఇక ఇప్పుడు పది రోజుల తర్వాత ఈ సినిమా వసూళ్లు 60 కోట్లు అంటూ నిర్మాతలు చెబుతున్నారు. దీనిపై ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ మాత్రం అంతా అబద్ధం అంటూ కొట్టి పారేస్తున్నారు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా 60 కోట్లకు పైగా షేర్.. 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందా అంటూ వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. కావాలనే చరణ్ సినిమాకు ఎక్కువ మొత్తం వసూలు చేసిందని ప్రచారం చేస్తున్నారని.. నిజానికి 40 కోట్లు కూడా తీసుకురాలేదంటున్నారు యాంటీ ఫ్యాన్స్.
వినయ విధేయ రామలో రామ్ చరణ్, కియరా అద్వానీ
ఇప్పుడు వినయ విధేయ రామ కలెక్షన్లపై సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుంది. మరి దీనికి సమాధానం ఎవరొచ్చి చెబుతారో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ‘వినయ విధేయ రామ’ విషయంలో ఫేక్ కలెక్షన్లే చెబుతున్నారంటూ సెటైర్లు అయితే గట్టిగానే పడుతున్నాయి. మరి దీనికి ఎక్కడ ఎవరు వచ్చి ఫుల్ స్టాప్ పెడతారనేది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.