• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • FAKE ABOUT MAHESH BABU MOVIE SUPERB PLAN TO AVOID COVID MHN

Super Star Mahesh - Sarkaru Vaari paata: మహేశ్ సినిమాలో అదంతా ఫేక్.. కోవిడ్‌కి దొరక్కుండా సూపర్ ప్లాన్

మహేష్ బాబు (Twitter/Photo)

Super Star Mahesh - Sarkaru Vaari paata: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌ర్కారువారి పాట సినిమా కోసం బ్యాంక్ సెట్ వేస్తున్నార‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదు.. అస‌లు మ‌హేశ్ అండ్ టీం ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

  • Share this:
    సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమా స‌ర్కారువారి పాట సినిమా జ‌న‌వ‌రి నుండి సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించి చాలా ర‌కాలైన వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ వ‌చ్చాయి. ఈ సినిమాలో విల‌న్ .. భార‌త‌దేశంలోని బ్యాంకుల‌ను మోసం చేసి విదేశాల‌కు పారిపోతే హీరో అత‌న్ని ఇండియా రప్పించి మోసం చేసిందంతా క‌ట్టిస్తాడు అని క‌థ‌కు సంబంధించిన వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గిన‌ట్లు సినిమా కోసం భారీ బ్యాంకు సెట్‌ను వేయ‌డానికి చిత్ర నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. కానీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆ వార్త‌ల్లో నిజం లేద‌ట‌. సినిమాను బ్యాంక్ నేప‌థ్యంలో తెర‌కెక్కించినప్ప‌టికీ అందుకోసం సెట్స్ వంటిది వేయ‌కుండా.. రియ‌ల్ లొకేష‌న్స్‌లోనే చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. చెన్నై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు ప్రాంతాల్లోని రియ‌ల్ లొకేష‌న్స్‌లోనే స‌ర్కారువారిపాట స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని ప‌క్కా స‌మాచారం.

    మ‌రి మ‌హేశ్ యు.ఎస్ షెడ్యూల్ ప్లానింగ్ ఏంటి? అనే ప్ర‌శ్న రాక‌మాన‌దు. ప్ర‌స్తుతం మంచు కాలం.. అందువ‌ల్ల యు.ఎస్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా వైర‌స్ కూడా జ‌న్యుప‌ర‌మైన రూపాంతంర చెందుతుంది. కాబ‌ట్టి నిర్మాత‌లు ముందుగా ఇండియాలో చిత్రీక‌రించాల‌నుకున్న పార్ట్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. జ‌న‌వ‌రి నుండి మార్చి ఎండింగ్ లోపు ఇండియా షెడ్యూల్‌ను పూర్తి చేసి ఏప్రిల్‌లో అమెరికా షెడ్యూల్ ప్లాన్ వేశార‌ట‌. ఎందుకంటే ఏప్రిల్ నాటికి స‌మ్మ‌ర్ స్టార్ట్ అవుతుంది కాబ‌ట్టి క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌ట‌మే అందుకు కార‌ణ‌మని అంటున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఏడాదిలో త‌న 27వ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మ‌హేశ్ భావిస్తున్నాడ‌ట‌.

    మ‌హేశ్ జోడీగా కీర్తిసురేశ్ న‌టించ‌నున్న ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఏంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న మహేశ్.. స‌ర్కారు వారిపాట‌తో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అనుకున్నాడు. అయితే మ‌హేశ్ స్పీడుకి క‌రోనా వైస్ బ్రేకులేసింది. మ‌హేశ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Anil
    First published: