హోమ్ /వార్తలు /సినిమా /

Fahadh Faasil - Nazriya Nazim: వామ్మో.. నజ్రియా, ఫహద్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

Fahadh Faasil - Nazriya Nazim: వామ్మో.. నజ్రియా, ఫహద్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

nazriya fahadh

nazriya fahadh

Fahadh Faasil - Nazriya Nazim: తమిళ, మలయాళ నటి నజ్రియా నజీమ్. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాలో నటించకపోగా రాజా రాణి అనే తెలుగు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

  Fahadh Faasil - Nazriya Nazim: తమిళ, మలయాళ నటి నజ్రియా నజీమ్. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాలో నటించకపోగా రాజా రాణి అనే తెలుగు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక డబ్బింగ్ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అంతేకాకుండా మలయాళం టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే 2014 లో మరో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకుంది.

  ఫహద్ ఫాజిల్ కూడా తెలుగులో ఇప్పటి వరకు నటించకపోగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమాలలో కనిపించాడు. ఇక వీరిద్దరూ కొన్ని సినిమాలలో కలిసి నటించగా అప్పుడే తమ ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇదిలా ఉంటే తాజాగా ఫహద్ ఫాజిల్ తన ప్రేమ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. తాను ఒకసారి ఉంగరం పెట్టి ప్రేమలేఖ ను నజ్రియాకు ఇచ్చాడట. ఇక అక్కడే తమ ప్రేమ కథ మొదలైందని.. కానీ నజ్రియా మాత్రం ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదట. ఆ సమయంలో తను వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడట. ఆమె చుట్టూ తిరుగుతూ ఉండటం తనకు చాలా నచ్చేదని తెలిపాడు ఫహద్. ఇక అప్పట్లో తన కోసం నజ్రియా చాలా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

  అలా విషయంలో తను చాలా బాధపడ్డాడట. ఇక అప్పుడు తమ కథ ముగిసినట్లే అనిపించిందని తెలిపాడు. ఆ సమయంలో తను మానసికంగా బలంగా లేనని తెలిపాడు. అదే సమయంలో నజ్రియా తనతో హలో మెథడ్ యాక్టర్.. మీరు ఎవరు అనుకుంటున్నారు? ఇది కేవలం ఒక సాధారణ జీవితం. అందరితో సర్దుకుపోవాలని ధైర్యం చెప్పిందట. అలా తను తన జీవితంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందని, ఇక తను సాధించే ప్రతి విషయంలో నజ్రియా పాత్ర ఉందని తెలిపాడు. ఇప్పటికీ ఆమె సహకారం లేనిది ఏ పని ఒంటరిగా చేయలేనని తెలిపాడు. ఇక ప్రస్తుతం నజ్రియా హీరో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఇక ఫహద్ ఫాజిల్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Fahadh faasil, Kollywood, Nazriya love story, Nazriya nazim, Tollywood

  ఉత్తమ కథలు