Home /News /movies /

F3 VENKATESH VARUN TEJ F3 MOVIE WORLD WIDE THEATRICAL BUSINESS HOW MUCH TO GET BREAK EVEN HERE ARE THE DETAILS TA

F3 - Pre Release Business : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. హిట్టు అనిపించుకోవాలంటే ఎంత రాబట్టలంటే..

ఎఫ్ 3 మూవీ టోటల్ థియేట్రికల్  ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

ఎఫ్ 3 మూవీ టోటల్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Venkatesh - Varun Tej - F3 Pre Release Theatrical Business | వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఎఫ్ 3’. ఎప్పడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే..

ఇంకా చదవండి ...
    F3 Movie  - US Premiers | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మూడేళ్ల క్రితం 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. ( రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

    వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే  ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ సినిమాను యూఎస్‌లో 350పైగా స్క్రీన్స్‌లో మే 26న ప్రీమియర్స్ వేయనున్నారు. ప్రైమ్ మీడియా యూఎస్ వాళ్లు అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ హక్కుల తీసుకున్నారు. ముందుగా ఈ సినిమాకు యూఎస్ సహా ఎక్కడ ప్రీమియర్స్ ఉండవంటూ ప్రకటించినా.. చివరకు ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. ఏరియా వైజ్‌గా బిజినెస్ వివరాలు..

    నైజాం (తెలంగాణ):  రూ. 18 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 8.40 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 7 కోట్లు
    ఈస్ట్: రూ. 4.50 కోట్లు
    వెస్ట్: రూ. 4 కోట్లు
    గుంటూరు: రూ. 5 కోట్లు
    కృష్ణా : రూ.4.50 కోట్లు
    నెల్లూరు: రూ. 2.4 కోట్లు                                                                                              తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total - రూ. 53.80 కోట్లు

    కర్ణాటక   : రూ. 3.40 కోట్లు                                                                                            రెస్టాఫ్ భారత్ : రూ. 1.20 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 5.20 కోట్లు                                                                                      ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 63.60 కోట్లు  / రూ 64.50 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.

    Mahesh Babu - Jr NTR : మహేష్, ఎన్టీఆర్, చైతూ సహా ఈ స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లులే వేరు.. ఆయనకు ఇద్దరు..


    ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.  ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న  విడుదల చేస్తున్నారు.   ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.

    Bigg Boss Non Stop Winner Bindu Madhavi : బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ తెలుగు విన్నర్‌ బిందు మాధవి ప్రైజ్ మనీ కాకుండా.. ఎంత సంపాదించిందంటే..


    అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, Dil raju, F3 Movie, F3 Movie Review, Tollywood, Varun Tej, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు