• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • F3 VENKATESH VARUN TEJ ANOTHER MEGA HERO WILL BE PLAY CRUCIAL ROLE IN F3 MOVIE HERE ARE THE DETAILS TA

F3 - Venkatesh - Varun Tej: వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 కోసం రంగంలోకి మరో క్రేజీ మెగా హీరో..

F3 - Venkatesh - Varun Tej: వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 కోసం రంగంలోకి మరో క్రేజీ మెగా హీరో..

వెంకటేష్, వరుణ్‌తేజ్‌ F3 మూవీలో మెగా హీరో(Twitter/Photo)

Venkatesh-Varun Tej F3: 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన సినిమా ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన ఈ చిత్రం 2019 సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఎఫ్ 3 మూవీలో మరో మెగా హీరో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.

  • Share this:
    Venkatesh-Varun Tej F3: 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన సినిమా ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన ఈ చిత్రం 2019 సూపర్ హిట్‌గా నిలిచింది. . చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక వరుణ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అలాంటి సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు ఎపుడో ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఎఫ్‌ 3 కథను కూడా పూర్తి చేసాడు. అంతేకాదు ఈ కథకు వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఒకే చేసారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మరో కథానాయకుడికి అవకాశం ఉందట. ఇకవెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. గత నెల 23న  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

    Venkatesh Varun Tej Anil Ravipudi F3 Regular Shooting Starts Today,Venkatesh-Varun Tej F3: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల F3 షూటింగ్ మొదలు.. సెట్‌లో అడుగుపెట్టిన వెంకీ మామ..,Venkatesh,Venaktesh F3 Movie Shooting Starts,Venkatesh Joins Shooting, F3 Movie,F 3 Officially Announcement,Happy Birthday Venkatesh,HBDVenkatesh,Happy Birthday Victory Venkatesh,F2,Venkatesh varun Tej F2,Venkatesh Varun Tej F3 Sequel,anil ravipudi,anil ravipudi twitter,anil ravipudi mahesh babu,anil ravipudi movies,anil ravipudi f3 movie,anil ravipudi f2 sequel mahesh babu,anil ravipudi venkatesh varun tej,anil ravipudi comedy scenes,anil ravipudi sarileru neekevvaru,anil ravipudi mahesh babu movie,telugu cinema,anil ravipudi f3 story leaked,అనిల్ రావిపూడి,అనిల్ రావిపూడి మహేష్ బాబు,అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్,ఎఫ్ 3 సీక్వెల్,ఎఫ్ 3 షూటింగ్ మొదలు,ఎఫ్ 3 షూటింగ్‌లో జాయిన్ అయిన వెంకటేష్,అనిల్ రావిపూడి,వెంకటేష్ అనిల్ రావిపూడి ఎఫ్ 3
    ‘ఎఫ్ 3’ షూటింగ్ మొదలు పెట్టిన వెంకీ మామ (Twitter/Photo)


    ఇక ఎఫ్ 3 ఫస్ట్ లుక్  పోస్టర్‌లో వెంకటేష్.. వరుణ్ తేజ్.. ఓ ట్రాలీలో డబ్బులు కట్టలు పట్టుకోని పోతున్నట్టు ఉంది. అంతేకాదు ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో కూడా ఎఫ్ 2 నటించిన తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.కథ ప్రకారం ఈ సినిమాలో మరో కథానాయకుడుకు ఛాన్స్ ఉంది. అది కూడా మెగా హీరోల నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్.. కథను కీలక మలుపు తిప్పే 10 నుంచి 15 నిమిషాల క్యారెక్టర్ చేయనున్నట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం  ఉంది.

    Sai Dharam Tej News, Solo Bratuke So Better, Allu Sirish, Allu Sirish marriage, Niharika Chaitanya Marriage, Mega Family marriage
    సాయి తేజ్


    ప్రస్తుతం వెంకటేష్.. నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలలో కానుంది. మరోవైపు వరుణ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ ‘గని’ కూడా ఈ యేడాది ఎండాకాలంలో విడుదల కానుంది.  ఇక ఎఫ్ 3 విషయానికొస్తే.. ఈ చిత్రాన్నిఈ యేడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు