Home /News /movies /

F3 VENKATESH VARUN TEJ ANIL RAVIPUDI DIL RAJU F3 MOVIE RELEASING IN 350 ABOVE THEATRES IN US TA

F3 : ఎఫ్ 3 యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధం.. మొత్తంగా ఎన్ని స్క్రీన్స్‌లో అంటే..

ఎఫ్ 3 మూవీ యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధం (Twitter/Photo)

ఎఫ్ 3 మూవీ యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధం (Twitter/Photo)

Venkatesh - Varun Tej - F3 Theatrical Trailer | వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఎఫ్ 3’. ఎప్పడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను యూఎస్ ప్రీమియర్స్‌కు అంతా సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
    F3 Movie  - US Premiers | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. ( రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

    వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే  ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ సినిమాను యూఎస్‌లో 350పైగా స్క్రీన్స్‌లో మే 26న ప్రీమియర్స్ వేయనున్నారు. ప్రైమ్ మీడియా యూఎస్ వాళ్లు అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ హక్కుల తీసుకున్నారు. ముందుగా ఈ సినిమాకు యూఎస్ సహా ఎక్కడ ప్రీమియర్స్ ఉండవంటూ ప్రకటించినా.. చివరకు ప్రీమియర్స్ వేస్తున్నారు.

    Nagarjuna - Annamayya: నాగార్జున ‘అన్నమయ్య’లో శ్రీ వేంకటేశ్వర స్వామిగా ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.  ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న  విడుదల చేస్తున్నారు.   ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.

    Chiranjeevi - Balakrishna - Jr NTR - Ram Charan : చిరంజీవి టూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ కొత్త కొత్తగా ట్రై చేస్తోన్న హీరోలు..

    అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, Dil raju, F3 film, Varun Tej, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు