F3 Movie - US Premiers | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మూడేళ్ల క్రితం 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. ( రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ మూవీ వచ్చింది. సీక్వెల్ కాదు.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సినిమా. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి.
ఆ సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఈ శుక్రవారం ఈ సినిమాను యూఎస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1400కు పైగా విడుదలైంది. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నైజాం (తెలంగాణ): రూ. 4.06 కోట్లు / రూ. 18 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 1.26 కోట్లు / రూ. 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.18 కోట్లు / రూ. 7 కోట్లు
ఈస్ట్: .0.76 కోట్లు / రూ. 4.50 కోట్లు
వెస్ట్: రూ,.0.94 కోట్లు / రూ. 4 కోట్లు
గుంటూరు: 0.88 కోట్లు / రూ. 5 కోట్లు
కృష్ణా : 0.66 కోట్లు / రూ.4.50 కోట్లు
నెల్లూరు:0.61 కోట్లు / రూ. 2.4 కోట్లు తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 10.35 కోట్లు (17 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 0.85 కోట్లు జ రూ. 3.40 కోట్లు
ఓవర్సీస్ :రూ. 2.15 కోట్లు / రూ. 5.20 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13.35 కోట్లు / రూ. 23 కోట్ల గ్రాస్ ) రూ. 63.60 కోట్లు / రూ 64.50 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.
NBK 107 - Balakrishna : ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ,గోపీచంద్ మలినేని మూవీపై బిగ్ అప్టేట్..
ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు.మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో మెరిసారు. ఈ సినిమా రూ. 51.15 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. పైగా టికెట్ రేట్స్ తెలంగాణలో దారణంగా ఉన్నాయి. వాటి ఎఫెక్ట్‌తో ఫ్యామిలీస్ ఈ సినిమా చూడడానికి మొగ్గు చూపుతారా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, F3 Movie, Tollywood, Varun Tej, Venkatesh