Home /News /movies /

F3 UNIT CLARITY ON MOVIE OTT RELEASE SOON SLB

F3ని ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారా..? రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీమ్

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (Photo Twitter)

వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (Photo Twitter)

F3 Movie Ott Release: ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు నెల తిరిగే లోపు ఓటీటీలోకి వస్తుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే F3 కూడా త్వరలోనే ఓటీటీలో వస్తుంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు అనుకున్న వారికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా ఇద్దరు హీరోలు బిగ్ షాకిచ్చారు.

ఇంకా చదవండి ...
దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F3. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆద్యంతం కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి గిలిగింతలు పెడుతోంది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసేందకు థియేటర్ల బాట పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు నెల తిరిగే లోపు ఓటీటీలోకి (OTT) వస్తుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే F3 కూడా త్వరలోనే ఓటీటీలో వస్తుంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు అనుకున్న వారికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా ఇద్దరు హీరోలు బిగ్ షాకిచ్చారు. ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసే చాన్సే లేదని చెప్పేశారు.

F3 సినిమాను ఇంతలా ఆదరించి ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్.. ఈ మూవీని థియేటర్లో చూడనివారు ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారేమో.. కానీ అది కుదరదు అని పేర్కొన్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మరో 8 వారాలు ఆగాల్సిందే అని అన్నారు. థియేట్రికల్‌ రన్‌కు రెండు నెలలు గడిచాకే డిజిటల్‌ ఎంట్రీ ఇస్తుందని కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీపై చిత్రయూనిట్ ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ సాధించిన F2 సినిమాకు సీక్వల్‌గా అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. అదనంగా సోనాల్ చౌహాన్ యాడ్ అయింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే హంగామా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది.

నవ్వుల హంగామా చేసేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ F3 సినిమాలో రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. తొలి షోతోనే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడుతుండటంతో ఇప్పటికీ అదే రెస్పాన్స్‌తో థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. దీనికి సీక్వల్‌గా F4 కూడా ఉంటుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Anil Ravipudi, Daggubati venkatesh, F3 Movie

తదుపరి వార్తలు