F3 సినిమాను ప్రమోట్ చేయడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ దశ నుంచే ప్రమోషన్స్ చేపట్టిన ఆయన పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు (Interesting facts) బయటపెట్టారు. అయితే సినిమా విడుదల తర్వాత కూడా ఆడియన్స్ దృష్టి మొత్తం తన సినిమాపైనే పడేలా చేసుకుంటున్న అనిల్.. రీసెంట్‌గా జరిగిన F3 సక్సెస్ మీట్‌లో (F3 Success meet) అంతకుమించి అనేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థంబ్ నేల్స్ (Thumb nails) పెట్టుకోండి.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయ్ అంటూ ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న ఈ టీమ్ అంతా అని, అలాగే మూడో ఫ్యామిలీ ప్రేక్షకులు అని చెప్పారు అనిల్ రావిపూడి.
కంటెంట్ బాగుంటే చాలు సినిమాను ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకుని ఆదరిస్తున్నారని, కోవిడ్ పరిస్థితుల తర్వాత వచ్చిన ''అఖండ, పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ బాట పట్టించాయని.. ఇప్పుడు ఆ సినిమాల సరసన F3 నిలవడం ఆనందంగా ఉంది" అని అనిల్ రావిపూడి అన్నారు. జస్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లండి. మీ స్ట్రెస్ అంతా పోతుంది.. హ్యాపీగా ఎంజాయ్ చేయకపోతే నన్ను అడగండి.. ఇది నాది ప్రామీస్ అంటూ F3 రిలీజ్ కాగానే తనదైన స్టైల్‌లో అనిల్ రావిపూడి చెప్పారు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్, నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ ఆడిపాడింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.
ఇకపోతే దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మురళీ శర్మ, ఆలీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది F3 మూవీ. అన్ని వర్గాల ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27.55 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేశారు ఈ సమ్మర్ సోగ్గాళ్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, Daggubati venkatesh, F3 Movie, Varun Tej