Home /News /movies /

F3 PRE RELEASE EVENT IN HYDERABAD SHILPAKALA VEDIKA TODAY SB

F3 Pre Release Event: ఇవాళ శిల్పకళావేదికలో 'ఎఫ్3' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఎఫ్3 ప్రి రిలీజ్ ఈవెంట్

ఎఫ్3 ప్రి రిలీజ్ ఈవెంట్

ఈ నెల 21న హైదరాబాదులో నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది.

    అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ఎఫ్3. ఈ మూవీలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాల్ చౌహాన్‌తో పాటు రాజేంద్రప్రసాద్,ప్రగతి వంటి కీలక నటులు కూడా నటించారు. ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్( జరగనుంది. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడింF3 Pre Release Event) ను ఈ నెల 21న హైదరాబాదులో నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమంచింది. 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం అని పేర్కొంది.

    వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబోలో వస్తున్న ఎఫ్3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సారి వెంకీ, వరుణ్ లకు కామెడీ కింగ్ సునీల్ కూడా తోడవడంతో వినోదం ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇక ఎఫ్3లో హాస్యనటుడు అలీ కూడా నటించాడు. ఆలీతో అనిల్ రావిపూడి 'పాలబేబీ' అనే వడ్డీ వ్యాపారి పాత్రను చేయించారు. తెరపై అలీ పాత్ర చాలా సేపు ఉంటుంది .. నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. చాలా కాలం తరువాత ఒక మంచి పాత్రను చేసిన ఫీలింగ్ కలిగిందన్నాడు ఆలీ. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

    ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిసున్నారు. ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌ గా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను నవ్వులు పూయిస్తోంది. ‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరిగే కథ అని, పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను వినోదాత్మకంగా చూపించామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇక టాలీవుడ్ వెంకీ మామకు ఆయన ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 'డబ్బు ఉన్నవాడికి ఫన్, లేనివాడికి ఫ్రస్ట్రేషన్' అని మురళీ శర్మ నోటి నుంచి డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తి ఉన్న యువకుడిగా వరుణ్ తేజ్ నటన అదిరిపోయింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anil Ravipudi, Daggubati venkatesh, F3 Movie, Varun Tej

    తదుపరి వార్తలు