F3 Movie : విజయ దశమి సందర్భంగా ఎఫ్ 3 మూవీ స్పెషల్ పోస్టర్ విడుదల..

F3 మూవీ దసరా స్పెషల్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

F3 Movie : అనిల రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ రోజు దసరా పర్వ దినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

 • Share this:
  F3 Movie : అనిల రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక వరుణ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.

  రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది.  అంతేకాదు దానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు.  ఈ రోజు దసరా పర్వదినం సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట.


  అంత బాగాF3  స్క్రిప్ట్ వచ్చిందని.. లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది. ఎఫ్ 2 ఫ్రస్టేషన్స్ మీదే వెళ్లాడు అనిల్. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసారు ఈ దర్శకుడు. అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంది. ఎఫ్ 2లో భర్తల ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో ఎఫ్ 3 రానుందని ప్రచారం జరుగుతుంది.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లే ఈ సినిమా కథ. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నాడు  దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదే మెయిన్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

  F3 Movie Venkatesh Varun Tej Tamannaah Mehreen F3 Special Dasara Poster Released,F3 Movie : విజయ దశమి సందర్భంగా ఎఫ్ 3 మూవీ స్పెషల్ పోస్టర్ విడుదల..,F3 Dasara Specila Poster Released,F3 Vijaya Dashami Special Poster Released,F3 Movie,F3 Movie Shoot Resumes,F3 Movie Shooting Re Start,f3 movie,f3 movie story,f3 movie story leaks,venkatesh varun tej f3 movie,f3 movie social media,telugu cinema,anil ravipudi f3 storyline,ఎఫ్ 3,ఎఫ్ 3 స్టోరీ లీక్,అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్టోరీ,వెంకటేష్,వరుణ్ తేజ్,విజయ దశమి సందర్భంగా ఎఫ్ 3 స్పెషల్ పోస్టర్ విడుదల
  F3 మూవీ దసరా స్పెషల్ పోస్టర్ విడుదల (Twitter/Photo)


  ఈ యేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన మరో మూవీ ‘దృశ్యం 2’ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: