Home /News /movies /

F3 MOVIE VENKATESH VARUN TEJ POOJA HEGDE F3 LIFE ANTE ITTA VUNDAALA LYRICAL SONG RELEASED TA

F3 - Venkatesh - Varun Tej : ఎఫ్ 3 మూవీ నుంచి లైఫ్ అంటే ఇట్లా ఉండాలి లిరికల్ సాంగ్ విడుదల..

ఎఫ్ 3 మూవీ నుంచి లిరికల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

ఎఫ్ 3 మూవీ నుంచి లిరికల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

Venkatesh - Varun Tej - F3 Theatrical Trailer | వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఎఫ్ 3’. ఎప్పడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లైఫ్ అంటే ఇట్టా ఉండాల లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    F3 Movie  - Life Ante Itta Vundaala Lyrical Song | అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు. ఈ సాంగ్‌లో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌తో పూజా హెగ్డే ఆడిపాడింది. ఈ సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.


    ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.  ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న  విడుదల చేస్తున్నారు.   ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.

    RRR : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హిందీ డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

    అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: F3 Movie, Tollywood, Varun Tej, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు