హోమ్ /వార్తలు /సినిమా /

F3 - 6 Days WW Collections : F3 మూవీ వాల్డ్ వైడ్ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టాలి..

F3 - 6 Days WW Collections : F3 మూవీ వాల్డ్ వైడ్ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టాలి..

F3 మూవీ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ (Twitter/Photo)

F3 మూవీ 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ (Twitter/Photo)

F3 Movie 6 Days Box Office Collections | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్  హీరోలుగా నటించిన ఎఫ్ 3. ఇక 6వ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

F3 Movie  - 6 Days Box Office Collections | F3 Movie  అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ నెల 27న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆద్యంతం కామెడీతో ఈ  సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసేందకు ఎగబడుతున్నారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని  అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చూసి ప్రశంసల ఝల్లు కురిపించింది.

F3 మూవీని అనిల్ రావిపూడి  పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించారు. ఇక సినిమా  చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆడియన్స్. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకులకు  ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా 6 రోజుల్లో రూ. 2.59 కోట్ల షేర్ (రూ. 4.35 కోట్లు గ్రాస్) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 6 రోజుల్లో బాక్సాఫీస్  విషయానికొస్తే..

Telangana Directors in Tollywood : తెలుగు వెండితెరపై సత్తా చూపెడుతున్న తెలంగాణ దర్శకులు వీళ్లే..


నైజాం (తెలంగాణ):  రూ. 15.94 కోట్లు / రూ. 18 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 5.15 కోట్లు / రూ. 8.40 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 4.92 కోట్లు / రూ. 7 కోట్లు

ఈస్ట్: రూ. 2.70 కోట్లు / రూ. 4.50 కోట్లు

వెస్ట్: రూ.2.01 కోట్లు / రూ. 4 కోట్లు

గుంటూరు: 2.70 కోట్లు / రూ. 5 కోట్లు

కృష్ణా : 2.38 కోట్లు / రూ.4.50 కోట్లు

నెల్లూరు:1.50 కోట్లు / రూ. 2.4 కోట్లు                                                                                              తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 37.30 కోట్లు (59.75 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు

కర్ణాటక + రెస్టాఫ్ భారత్    :రూ. 2.55 కోట్లు / రూ. 3.40 కోట్లు

ఓవర్సీస్ :రూ. 6.55 కోట్లు /  రూ. 5.20 కోట్లు                                                                                      ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 46.40 కోట్లు ( రూ. 77.00 కోట్ల గ్రాస్ ) /రూ. 63.60 కోట్లు..

Tollywood Telangana: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే..

Day 1 WW Share : రూ. 13.65 కోట్లు

Day 2 WW Share : రూ. 9.85 కోట్లు

Day 3 WW Share : రూ. 11.05 కోట్లు

Day 4 WW Share : రూ. 5.40 కోట్లు

Day 5 WW Share : రూ. 3.86 కోట్లు

Day 6 WW Share : రూ. 2.59 కోట్లు

ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు.మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో మెరిసారు. మొత్తంగా రూ.18.10 కోట్లు రాబడితే హిట్ అనిపించుకుంటోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

First published:

Tags: Anil Ravipudi, F3 Movie, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు